Vitamin D Side-Effects : వామ్మో.. శరీరంలో విటమిన్ డి పెరిగితే అంత ప్రమాదమా?

శరీరంలో విటమిన్ డి లోపించడంతో విటమిన్ డి (Vitamin D) ని పెంచుకోవడానికి చాలామంది ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉంటారు.

  • Written By:
  • Updated On - November 21, 2023 / 04:25 PM IST

Side-Effects Caused by taking Excess Vitamin D : మామూలుగా విటమిన్ డి లోపించడం అన్నది కామన్. అయితే మనకు విటమిన్ డి ఎక్కువగా సూర్యరశ్మి నుంచి లభిస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుత రోజుల్లో సిటీలలో ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లే కావడంతో ఎక్కడ చూసినా కూడా ఆ నీడ ప్రాంతమే కనిపిస్తూ ఉంటుంది. దానికి తోడు ప్రజలు కూడా ఎందుకు బయటకు రావడానికి ఇష్టపడటం లేదు. దాంతో శరీరంలో విటమిన్ డి లోపించడంతో విటమిన్ డి (Vitamin D) ని పెంచుకోవడానికి చాలామంది ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉంటారు. అయితే విటమిన్ డి మన శరీరంలో కరెక్ట్ గా ఉన్నప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం అన్న విషయం తెలిసిందే.

We’re Now on WhatsApp. Click to Join.

అయితే విటమిన్ డి (Vitamin D) కేవలం సూర్య రశ్మి నుంచి మాత్రమే కాకుండా మనం తినే ఆహార పదార్థాల నుంచి కూడా లభిస్తూ ఉంటుంది. తగిన మోతాదులో శరీరంలో విటమిన్ డి ఉన్నప్పుడు రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. అలాగే సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అలా అని విటమిన్ డి (Vitamin D) ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు. అలాగే ఇంకా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి శరీరంలో విటమిన్ డి ఎక్కువ అయితే ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. విటమిన్ డి ఎక్కువ అయినప్పుడు వాంతులు విరేచనాలు వికారం లాంటి సమస్యలు వస్తాయి.

భోజనం చేసిన తర్వాత ఈ లక్షణాలు ఎక్కువగా కనబడితే శరీరంలో విటమిన్ డి అధికంగా ఉంది అని తెలుసుకోవాలి. అలాగే ఆకలి లేకపోవడం సమయానికి భోజనం సరిగా చేయకపోవడం కారణం శరీరంలో విటమిన్ డి ఎక్కువ అవ్వడం. పరిస్థితి ఇలాగే కొనసాగితే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. కిడ్నీ సమస్యలు కూడా విటమిన్ డి అధికంగా ఉండడం కారణంగానే ఉంటాయి. విటమిన్ డి ఎక్కువ అయితే కిడ్నీలలో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. విటమిన్ డి మోతాదు శరీరంలో ఎక్కువైతే రక్తంలో కాల్షియం పేరుకుపోతుంది. దాని ఫలితంగా హైపర్ కాలిపోయిన అనే సమస్య వస్తుంది.

ఈ సమస్య వచ్చినప్పుడు అలసట, వాంతులు తరచూ మూత్రవిసర్జన లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఈ అధిక విటమిన్ డి సమస్య ను కంట్రోల్ చేయాలంటే ఎక్కువగా సల్మాన్ ఫిష్, గుడ్డు సోనా, సోయా, పాలు లాంటి ఆహారాలను అలాగే పుట్టగొడుగులను తక్కువగా తీసుకుంటూ ఉండాలి.

Also Read:  White Hair: తెల్లజుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే చాలు ఐదు నిమిషాల్లో జుట్టు నల్లగా మారడం ఖాయం..?