Weight Loss: వేసవిలో బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే వీటిని తీసుకోవాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో అధిక బరువు అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ అధిక బరువు సమస్య కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాగా

  • Written By:
  • Publish Date - May 22, 2023 / 08:45 PM IST

ప్రస్తుత రోజుల్లో అధిక బరువు అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ అధిక బరువు సమస్య కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాగా బరువు పెరగడం కారణంగా చాలా మందిలో గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు వస్తాయి. అయితే శరీర బరువును ఎంత సులభంగా తగ్గించుకుంటే అంత మంచిది లేకపోతే ప్రాణాంతకంగా మారే ఛాన్స్‌ ఉంది. శరీర బరువు ఒక్కసారిగా పెరిగిపోవడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు కూడా పెరుగుతాయి. అయితే చాలామంది శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం కోసం రకరకాల ఎక్ససైజ్లు జిమ్లో వర్కౌట్లు చేస్తూ ఉంటారు.

అలాగే రకరకాల ఆహార పదార్థాలను కూడా డైట్లో చేర్చుకుంటూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో దిగులు చెందుతూ ఉంటారు. కాగా ప్రస్తుతం వేసవికాలం అన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి వేసవిలో బరువును ఎలా నియంత్రణలో ఉంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే అందుకోసం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెసర పప్పు.. పెసర పప్పులో శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్‌, ఫైబర్‌ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఈ పప్పును ఆహారంలో తీసుకుంటే శరీరంలో కొలిసిస్టోకినిన్ హార్మోన్లను పెంచి ఆకలిని నియంత్రిస్తుంది.

దీంతో మీరు సులభంగా బెల్లీ ఫ్యాట్‌తో పాటు శరీర బరువును నియంత్రించుకోవచ్చు. మజ్జిగ.. వేసవి కాలంలో మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో కూడా ఆకలిని నియంత్రించే చాలా రకాల యాసిడ్స్‌ లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు భోజనం చేసిన తర్వాత తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీర కూడా హైడ్రేట్‌గా ఉంటుంది. అలాగే చియా విత్తనాలు.. చియా విత్తనాలలో శరీరానికి కావాల్సిన చాలా రకాల ప్రోటీన్స్‌ లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో కరిగే ఫైబర్‌ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటినికి క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల ఆకలిని నియంత్రించి బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తుంది. వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గొచ్చు.