మన వంటింట్లో దొరికే సుగంధ ద్రవ్యాలలో యాలకులు కూడా ఒకటి. యాలకులు ఎన్నో రకాల స్వీట్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే వంటల్లో కూరల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు.. వీటి వాసన అలాగే రుచి ఎంతో అద్భుతంగా ఉంటాయి. కూరల్లో అలాగే స్వీట్లు తయారీలో వీటిని వేయడం వల్ల వాటికి మరింత రుచిని తెస్తాయి. కొందరు యాలకులను పచ్చిగా కూడా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా పచ్చిగా తినడం వల్ల నోటి దుర్వాసన సమస్య ఉండదు. అయితే యాలకుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే.
మరి వీటి వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముఖ్యంగా యాలకులు బరువు తగ్గడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయట. యాలకులు శరీరం జీవక్రియ రేటును పెంచుతాయి. జీవక్రియలో ఈ పెరుగుదల మరింత కేలరీలు, కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుందట. అలాగే ఇది బరువు తగ్గడానికి దారితీస్తుందని చెబుతున్నారు. అలాగే యాలకులు ఆకలిని అణచివేసే లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల ఎక్కువ తినాలి అనే కోరిక తగ్గుతుంది. తక్కువగా తినడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు. యాలకులు సహజ మూత్ర విసర్జనగా పని చేస్తాయి.శరీరంలోని అదనపు నీటిని,ఉబ్బరాన్ని తొలగించడంలో సహాయపడుతుందట.
నీటి నిలుపుదలలో ఈ తగ్గింపు మొత్తం శరీర బరువును తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి దోహదం చేస్తుందని చెబుతున్నారు. ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయట. అలాగే బరువు తగ్గించే ప్రయాణాలలో సాధారణ అడ్డంకులు అయిన అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకాన్ని నివారిస్తాయని చెబుతున్నారు. యాలకులు శరీరం నుండి విషాన్ని తొలగించడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయట. దీర్ఘకాలిక మంట తరచుగా బరువు పెరుగుటతో సంబంధం కలిగి ఉంటుంది. ఏలకులు ఇన్ఫ్లమేషన్‌తో పోరాడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటాయట. అయితే బరువు తగ్గాలి అనుకున్న వారు యాలకులను ఎలా తీసుకున్నా సరే బరువు తగ్గుతారని చెబుతున్నారు.