Site icon HashtagU Telugu

Weight Loss Tips at Home : అధిక బరువుతో బాధపడుతున్నారా..? ఉదయం లేవగానే ఇవి తాగండి..సన్నబడడం ఖాయం

Weight Loss Tips At Home

Weight Loss Tips At Home

ఇటీవల కాలంలో చాలామంది అధిక బరువు (Weight ) తో విపరీతంగా బాధపడుతున్నారు. ఆహార అలవాట్లు , ఇష్టపూర్తిగా టైం అంటూ లేకుండా తినడం, ఎక్కువసేపు కుర్చీని వర్క్ చేస్తుండడం, దీనికితోడు శారీరక వ్యాయామం లేదా వాకింగ్ లేకపోవడంతో స్థూలకాయం వచ్చేస్తోంది. ఫలితంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అధిక బరువు అనేది ప్రస్తుతం చిన్న పిల్లల్నించి పెద్దల వరకూ అందర్నీ వేధిస్తోంది. మనిషి శరీరానికి రోజుకు ఎన్ని కేలరీలు అవసరమో అంతకంటే ఎక్కువ తినడం వల్ల చాలా త్వరగా ఊబకాయం బారినపడుతున్నారు. అయితే అధిక బరువు తో బాధపడుతున్న వారు ఇలా ప్రతి రోజు చేస్తే సన్నబడడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

We’re now on WhatsApp. Click to Join.

Weight Loss Tips at Home :

* గ్రీన్ టీ అనేది సన్నబడేందుకు బాగా పనిచేస్తుంది. ప్రతి రోజూ ఉదయం పరగడుపున గ్రీ టి తాగాలి. దీని రుచి చేదుగా ఉన్నప్పటికీ బరువు తగ్గడంలో చాల ఉపయోగపడుతుంది.

* సెలెరీ అనే మసాలా దినుసు కూడా బరువు తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. దీనిని క్యారమ్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం వడగట్టి తాగాలి.

* సోంపు కూడా బరువు తగ్గించడంలో కీలక పాత్రే పోషిస్తుంది. సాధారణంగా మనం భోజనం చేసిన తర్వాత సోంపు తింటుంటాం. ఎందుకంటే ఇది సహజమైన మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీళ్లలో ఒక చెంచా సోంపును కలిపి రాత్రంతా నానబెట్టాలి. దీన్ని కాటన్ క్లాత్‌లో ఫిల్టర్ చేసి పరగడుపున తాగిన బరువు తగ్గుతాం.

* లెమన్ వాటర్ కూడా బరువు తగ్గించడం లో ఉపయోగపడుతుంది. ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను పిండుకుని అందులో బ్లాక్ సాల్ట్ కలుపుకుని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల బరువు తగ్గుతాం.

* రోజుకు 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర తగినంతగా ఉంటే శరీరంలోని కండరాలకు పూర్తి స్థాయిలో విశ్రాంతి లభించి..తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమౌతుంది. జీవక్రియ వేగవంతం కావడం వల్ల స్థూలకాయం సమస్య దూరమౌతుంది.

* ప్రతిరోజూ పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే కాకుండా శరీరం ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండేందుకు దోహదపడతాయి. పండ్లలో పెద్దమొత్తంలో ఉండే ఫైబర్ ఇందుకు ఉపయోగపడుతుంది. దీనికోసం యాపిల్, తృణ ధాన్యాలు, జామ, అరటి, బీన్స్ ఎక్కువగా తినాలి.

Read Also : Summer Special Trains: ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. వేస‌విలో ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌ప‌నున్న రైల్వే శాఖ‌