Site icon HashtagU Telugu

Mushrooms: మష్రూమ్స్ తో బరువు తగ్గడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు?

Mushrooms

Mushrooms

పుట్టగొడుగులు.. వీటిని ఇంగ్లీషులో మష్రూమ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలామంది వీటిని తినడానికి ఇష్టపడితే కొద్దిమంది మాత్రమే వీటిని తినడానికి అంతగా ఇష్టపడరు. చాలామంది వీటిని తినకపోవడానికి గల కారణం కూర చేసిన తర్వాత కొంచెం జిగురుగా ఉండడం వల్లే. కొంతమంది ఇతర కారణాల వల్ల కూడా వీటిని తినడానికి అంతగా ఇష్టపడరు. పుట్టగొడుగు వల్ల లాభాలు తెలిసిన వాళ్ళు మాత్రం లొట్టలు వేసుకొని మరి తినేస్తూ ఉంటారు. ఈ పుట్టగొడుగులు మనకు ఎక్కువగా పల్లెటూరి ప్రాంతంలో పొలాల గట్లపై చెట్ల కింద తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో కనిపిస్తూ ఉంటాయి.

ఈ మధ్యకాలంలో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో పుట్టగొడుగుల పెంపకం అంటూ చాలామంది వీటిని ఇంట్లోనే పెంచుతున్నారు. ఇకపోతే పుట్టగొడుగుల వల్ల అనేక లాభాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మరి పుట్టగొడుగు వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందా.. బరువు తగ్గాలనుకునేవారు వీటిని తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చు. వీటిలో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె పోటు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా చాలా రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

మధుమేహం సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్‌ రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఆధునిక జీవన శైలి కారణంగా మెదడులో సమస్యలు రావడం సర్వసాధరణం అయ్యింది. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారాల్లో పుట్టగొడుగులను తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఒత్తిడిని కూడా సులభంగా తగ్గిస్తుంది. తరచుగా టెన్షన్ గురయ్యేవారు తప్పకుండా వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. పుట్టగొడుగులు శరీర బరువును తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే గుణాలు ఆకలిని నియంత్రించి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా సలాడ్స్‌లో వీటిని వినియోగించాల్సి ఉంటుంది.

Exit mobile version