Site icon HashtagU Telugu

Weight Loss Drinks: ఒంట్లో కొవ్వు కరిగి పోవాలంటే వారం రోజులు పాటు ఈ డ్రింక్ తాగాల్సిందే!

Weight Loss Drinks

Weight Loss Drinks

ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు శరీరంలో అదనపు కొవ్వు సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ అలాగే ఇతర హోటల్ ఫుడ్ లు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకు పోయి ఫ్యాట్ గా కనిపిస్తూ ఉంటారు. ఇక ఈ అదనపు కొవ్వును కరిగించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయినా కూడా కొవ్వు కరగలేదని చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ ఇక మీదట శరీరంలో అదనపు కొవ్వు గురించి ఇకపై ఆందోళన చెందవల్సిన అవసరం లేదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొన్ని రకాల నేచురల్ డ్రింక్స్ సహాయంతో ఈజీగా బరువు తగ్గడంతో పాటు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కూడా కలిగించుకోవచ్చు అని చెబుతున్నారు.

అయితే మార్కెట్లో దొరికే రసాయన పానీయాలు కాకుండా ఈ సహజసిద్ద పానియాలు రోజూ క్రమం తప్పకుండా తాగితే తప్పకుండా కొవ్వు కరుగుతుందట. ఆ పానీయాలు ఏంటి అన్న విషయానికి వస్తే.. ఒక గ్లాసుడు నీళ్లలో 2 నుంచి 3 టీ స్పూన్ల ఉసిరి రసాన్ని కలిపి, రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో సేవిస్తే, కొవ్వు తగ్గడమే కాకుండా చర్మ కాంతిని పునరుద్ధరిస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. కాగా నిమ్మకాయల్లో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసాన్ని పిండాలి. ఈ నీటిని పరగడుపున తాగితే 7 రోజుల్లోనే ఫలితాన్ని పొందవచ్చు. కాగా కొబ్బరి బోండం నీళ్లలో అధిక పోషకాలు, తక్కువ కేలరీలు ఉంటాయి.

ఇవి బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెబుతున్నారు. జీవక్రియను పెంచడం ద్వారా శరీర తేమను నిలపుకోవడానికి, అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అల్లం టీ కూడా శరీర ఉష్ణోగ్రత, జీవక్రియను పెంచడానికి సహాయపడుతుందట. అల్లం టీ తాగలేకపోతే కొన్ని అల్లం ముక్కలను వేడి నీటిలో వేసి పది నిమిషాలు మరిగించి ఆ నీటిని తాగినా చాలని చెబుతున్నారు.
అదేవిధంగా యాపిల్ సైడర్ వెనిగర్‌ లో ఎసిటిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఈ పానీయం పొట్ట, నడుము కొవ్వును పోగొట్టడానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, ఒక టీస్పూన్ తేనె కలిపి భోజనానికి ముందు తాగాలి. ఇది శరీరంలో కొవ్వును ఇట్టే కరిగిస్తుందని చెబుతున్నారు. అలాగే బ్లాక్ కాఫీ చాలా కెఫిన్ ఉంటుంది. ఇది శరీరం జీవక్రియ రేటును పెంచడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ చక్కెర లేని బ్లాక్ కాఫీ మాత్రమే తాగాలి. పంచదార, పాలు అస్సలు వేసుకోకూడదని చెబుతున్నారు. పైన చెప్పిన ఈ నేచురల్ డ్రింక్స్ తాగితే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోయి అధిక బరువు సమస్య నుంచి కూడా బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

note : ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.