Site icon HashtagU Telugu

Apple Juice: యాపిల్ జ్యూస్.. ఇలా చేసుకుని తాగితే బరువు తగ్గుతారు..

apple juice for weightloss

apple juice for weightloss

Apple Juice: అధికబరువు.. ఇది చాలా మందికి అనేక రకాల సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఆహారపు అలవాట్లు, శారీరకశ్రమ లేకపోవడం, పనిభారం, ఒత్తిడి మొదలైనవి కూడా బరువు పెరగడానికి కారణాలు. బరువు తగ్గాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. డైట్, వ్యాయామాలు ఎన్నిచేసినా.. బరువు తగ్గడం లేదని ఫీలవుతుంటాం. కేవలం ఇవే కాకుండా.. కొన్ని చిట్కాలు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వాటిలో ఒకటి యాపిల్ జ్యూస్. బరువును తగ్గించే యాపిల్ జ్యూస్ ను ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా తాగితే.. వారంరోజుల్లోనే తేడా కనిపిస్తుంది. మరి బరువును తగ్గించే ఈ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

యాపిల్ జ్యూస్ తయారీకి కావలసినవి

గ్రీన్ టీ – 1ప్యాకెట్
యాపిల్ – తరిగినది 1 కప్పు
అల్లం – పావుకప్పు
ఆపిల్ సైడర్ వెనిగర్ – 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం – 3 టేబుల్ స్పూన్లు

వెయిట్ లాస్ యాపిల్ జ్యూస్ తయారీ విధానం

ముందుగా గ్రీన్ టీ బ్యాగ్ తీసుకుని 200 మిల్లీలీటర్ల వేడినేటిలో వేసి బాగా నానబెట్టాలి. తర్వాత మిక్సింగ్ జార్ తీసుకుని అందులో 1 కప్పు మీడియం సైజ్ యాపిల్ కట్ చేసి వేయాలి. దానితోపాటు తురిమిన అల్లం, యాపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత చల్లారిన గ్రీన్ టీ వాటర్ సహా.. అన్ని పదార్థాలను వేయాలి.

వీటన్నింటినీ మిక్సీలో పేస్ట్ లాగా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన బరువును తగ్గించే జ్యూస్ ను ఫిల్టర్ చేయకుండా ఉదయం, సాయంత్రం తాగాలి. దీనితోపాటు సరైన డైట్ పాటించాలి. కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం మంచిది కాదు. ప్రాసెస్ చేసిన ఆహారాలను తినరాదు. నాన్ వెజ్ ఇష్టపడేవారైతే.. చేపలు, రొయ్యలను తినడం మంచిది. మటన్ కు వీలైనంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా శీతాకాలంలో మటన్ ఎక్కువగా తినకూడదు.

అధికబరువు ప్రభావం కేవలం శరీరంపైనే కాదు. మనిషి మానసిక స్థితి మీద కూడా పడుతుంది. డిప్రెషన్ లోకి వెళ్తారు. కొవ్వు ఎక్కువైతే.. ఊపిరితిత్తుల్లో వాయుమార్గాలు సంకోచిస్తాయి. ఇంకా చాలా నష్టాలున్నాయి. నచ్చిన డ్రెస్ వేసుకోలేరు. అందంగా కనిపించాలంటే.. శరీర బరువు తగ్గాల్సిందే.

 

Exit mobile version