Weight Loss: స్త్రీలు బరువు తగ్గాలని చూస్తున్నారా.. అయితే వీటిని తినాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో చాలామంది స్త్రీలు పురుషులు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ అధిక బరువు సమస్య

  • Written By:
  • Publish Date - February 9, 2023 / 06:30 AM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది స్త్రీలు పురుషులు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ అధిక బరువు సమస్య కారణంగా ఎటువంటి పనులు చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అధికబరువును తగ్గించుకోవడం కోసం నిత్యం ఎన్నో రకాల వ్యాయామాలు, ఎక్సర్ సైజులు, ఎన్నో రకాల చిట్కాలను పాటించినప్పటికీ ఫలితం లేదని బాధపడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా స్త్రీలు అధిక బరువు సమస్యతో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మరి స్త్రీలు తొందరగా బరువు తగ్గాలంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. యాపిల్స్, ద్రాక్షపండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె లు పుష్కలంగా లభిస్తాయి.

బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీల్లో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్థాయి. వీటిలో రక్తపోటును, కొలెస్ట్రాల్ ను తగ్గించే స్వభావం ఉంటుంది. రేగు పండ్లు, పీచ్ లు, నెక్టరిన్లు, నేరేడు పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. అలాగే బరువు తగ్గాలి అనుకున్న వారు గుమ్మడికాయ, అవిసె గింజలు, చియా, పొద్దు తిరుగుడు, జనపనార విత్తనాలు వంటి గింజల్లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభించే గింజలను తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు. అదేవిధంగా సీజనల్ కూరగాయలు అయిన కాలే, బెల్ పెప్పర్స్, బ్రోకలీ, బీన్స్, టమోటాలు, కాలీఫ్లవర్, బచ్చలికూర, ఇతర ఆకుకూరలను ఎక్కువగా తినడం వల్ల అవి బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

అలాగే బరువు తగ్గాలి అనుకున్న వారు గుడ్లు తినడం తప్పనిసరి. ప్రోటీన్లు, విటమిన్ బి, విటమిన్ బి6, విటమిన్ బి 12, విటమిన్ డి, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తింటే మంచిది. క్వినోవా, ఓట్స్, చిక్పీస్, కిడ్నీ బీన్స్, పింటో, బ్లాక్ బీన్స్ వంటి చిక్కుళ్లలో అన్ని రకాల ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా పుష్కలంగా లభిస్తాయి. ఇవి కూడా మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. తద్వారా తొందరగా ఆకలి కాదు.