మామూలుగా చిన్న పిల్లలు ఏది కావాలి అంటే అది తల్లిదండ్రులు కొనివ్వడం లేదంటే చేసి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు బాగా తిని లావు పెరిగితే మరి కొంతమంది ఎన్ని పదార్థాలు తిన్నా కూడా అలాగే బక్క బక్కగా, బక్క పలుచగా ఉంటారు. కొంతమంది బక్క పలుచగా ఉండడం కారణంగా చిన్న చిన్న విషయాలకి అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. వయసు పెరిగినా కూడా అలాగే బక్కగా ఉంటూ ఉంటారు. కానీ పిల్లలు ఆరోగ్యంగా పెరిగి బాగా లావు అవ్వాలి అనుకుంటే ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలు తినిపించాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏవి అన్న విషయానికి వస్తే..
పిల్లలు ఆరోగ్యంగా బరువు పెరగాలి అనుకుంటే తప్పకుండా వారికి బంగాళదుంపలు తినిపించాలని చెబుతున్నారు. బంగాళదుంపతో తయారు చేసిన ఆహార పదార్థాలు తినిపించడం వల్ల ఈజీగా ఆరోగ్యంగా బరువు పెరుగుతారట. బంగాళదుంపలో కేలరీలు, అమైనో ఆమ్లాలు, డైటరీ ఫైబర్ అధికంగా ఉంటాయి. దీనివల్ల పిల్లలు త్వరగా బరువు పెరుగుతారట. అలాగే ఇందులోమంచి మొత్తంలో శక్తిని ఇచ్చే పోషకాలను కలిగి ఉంటుంది. ఇందులో 105 కేలరీలు ఉంటాయి. గుడ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో చేస్తాయి. గుడ్లు మంచి మొత్తంలో ప్రోటీన్లు, విటమిన్లు,పోషకాలను కలిగి ఉంటాయి. ఎదిగే శిశువులకు ఇవి చాలా అవసరం అని చెబుతున్నారు. అలాగే పిల్లలు వారి వయస్సుకు తగిన బరువును నిర్వహించడంలో సహాయపడుతుందట.
కానీ పిల్లలకు ఉడకబెట్టిన గుడ్లు ఎక్కువ ఇవ్వడం అంత మంచిది కాదని చెబుతున్నారు. అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటివి కూడా పిల్లలు ఆరోగ్యంగా బరువు పెరగడానికి బాగా ఉపయోగపడతాయట. ఇందులో మంచి పోషకాలు చక్కెర శక్తి ఉన్నాయని, ఇవి ఆరోగ్యంతో పాటు బరువు పెరగడానికి కూడా సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే పాలు లేదా పాల ఉత్పత్తులు కూడా పిల్లలు ఆరోగ్యంగా బరువు పెరగడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయట. ఎదిగే పిల్లల ఆహారంలో చీజ్ పాలు వెన్న వంటివి చేర్చాలని వీటిలో ఉండే కాల్షియం ఎముకలను దృఢపరిచి, ఎదుగుదలకు తోడ్పడుతుందని చెబుతున్నారు. అప్పుడప్పుడు తక్కువ మొత్తంలో కూడా పిల్లలకు మాంసాహారం తినిపిస్తూ ఉండవచ్చును చెబుతున్నారు. పీనట్ బటర్ తినడం వల్ల ఎదిగే పిల్లలకు ఎంతో మేలు జరుగుతుందట. ఈ నెయ్యిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయట. ఇది కూరగాయలు లేదా పండ్లతో తీసుకోవాలి. కానీ అతిగా తీసుకోవడం కూడా మంచిది కాదని మితంగా మాత్రమే తినాలని చెబుతున్నారు.