Site icon HashtagU Telugu

Sleep: ఆదివారం రోజు ఆలస్యంగా నిద్ర లేస్తున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

Mixcollage 07 Dec 2023 08 24 Pm 4828

Mixcollage 07 Dec 2023 08 24 Pm 4828

మామూలుగా వీకెండ్ వచ్చింది అంటే చాలు సూర్యోదయం అయినా కూడా నిద్ర లేవకుండా కొంతకంగా అలాగే పడుకొని ఉంటారు. వారం అంతా ఉరుకుల పరుగులు తీస్తూ కంటి నిండా నిద్ర లేనివారు ఆదివారం ఎంచక్కా గురక పెట్టి మరి పదింటి వరకు పడుకొని నిద్రపోతూ ఉంటారు. ఇంకొందరు అయితే ఆరోజు మొత్తం పడుకొని చాలా బద్ధకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే అలా చేయడం చాలా ప్రమాదం అంటున్నారు వైద్యులు. ఎందుకంటే వారాంతాల్లో 90 నిమిషాలు ఎక్కువ సమయం నిద్రపోతే కడుపులో గట్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుందట.

ఈ బ్యాక్టీరియా హార్ట్ ఎటాక్, స్ట్రోక్, ఒబెసిటి వంటి తీవ్రమైన అనారోగ్యాలకు కారణం ఆవుతుందట. ఎక్కువ సమయం పాటు పడుకోవడం, ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం వల్ల రోజూవారి భోజన సమయాలు డిస్టర్బ్ అవుతాయి. ఈ డైట్ మెస్ శరీరంలో ఇన్ ఫ్లమేషన్ కు కారణం అవుతుందట. వారాంతాల్లో ఉదయం ఎక్కువ సమయం పాటు నిద్రపోయే వారు తినే ఆహారం అంత హెల్దీగా ఉండదని, చక్కెర కలిగిన పానీయాలు ఎక్కువగానూ, పండ్లు, గింజలు తక్కువ గానూ తింటారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఆహారపు అలవాట్లు గట్ మైక్రోబయోమ్‌ల మీద నేరుగా ప్రభావం చూపుతాయట.

ఆలస్యంగా నిద్రపోయేవారి స్లీప్ ప్యాటర్న్ తో పోలిస్తే ఆలస్యంగా నిద్ర లేచే వారిలో ఇన్ప్లమేషన్ గుర్తులు ఎక్కువగా ఉన్నాయట. బాడీ క్లాక్‌లో అంతరాయం వల్ల బరువు పెరగడం, గుండె సమస్యలు రావడం, మధుమేహం బారిన పడడం వంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయట. అలాగే కొన్ని రకాల మైక్రోబ్స్ వల్ల గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. జీర్ణవ్యవస్థలో దాదాపు 17 రకాల బ్యాక్టీరియా జాతులను గుర్తించారట. సోషల్ జెట్ లాగ్ వల్ల వారాంతాల్లో ఆలస్యంగా నిద్రపోయ్యే వారిలో మరోతొమ్మిది రకాల బ్యాక్టీరియాలు ఎక్కువగా కనిపించాయట. వీటిలో మూడింటి వల్ల ఊబయాయం, గుండె పనితీరు సరిగ్గా లేకపోవడం, ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉండడం వంటి ప్రమాదకర అనారోగ్యాలు కలుగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టివీకెండ్ అయినా సరే బద్దకంగా నిద్రపోవడం అస్సలు మంచిది కాదు.