మండే ఎండల్లో చర్మాన్నీ అలాగే ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే తినే ఆహార పదార్థాలు పానీయాల విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి. అందుకే వేసవికాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. వాటితో పాటు పండ్లు కాయగూరలు కూడా తినాలని చెబుతున్నారు. మరి వేసవి కాలంలో తీసుకోవాల్సిన పండ్లు కూరగాయలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
దోసకాయ, గుమ్మడికాయ రెండూ చూడటానికి గుండ్రటి ఆకారంలో ఉంటాయి. ఈ రెండు కూరగాయలలో నీరు సమృద్ధిగా ఉంటుంది. వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు చర్మానికి కూడా ఇది చాలా మంచిదట. దోసకాయలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, ఇది శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుందట. కూరగాయలు, రసం , సలాడ్ తయారు చేయడం ద్వారా మీరు గుమ్మడికాయ , దోసకాయ తినవచ్చని చెబుతున్నారు. వేసవికాలంలో తీసుకోవలసిన వాటిలో టమాట కూడా ఒకటి. ఇందులో కూడా 95 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైద్రేటెడ్ గా ఉంచడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఎ, సి, బి2, పొటాషియం, ఫోలేట్ , ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఇందులో లభిస్తాయి. అదేవిధంగా పాలకూరలో మంచి నీరు కూడా ఉంటుంది, మీరు సలాడ్ లేదా జ్యూస్ తయారు చేసి త్రాగవచ్చని చెబుతున్నారు.
కాగా పుచ్చకాయలో కూడా నీరు సమృద్ధిగా ఉంటుంది. ఇందులో 90 శాతం నీరు ఉంటుంది. ఈ పండును తీసుకోవడం వల్ల నీటి లోపం తొలగిపోతుందట. శరీరం కూడా ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటుందట. విటమిన్ ఎ, సి, పొటాషియం, లైకోపీన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుచ్చకాయలో ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అని చెబుతున్నారు. కాగా నిమ్మకాయను షికంజీ, షర్బత్,ఆహార పదార్థాల తయారీలో చాలా రకాలుగా ఉపయోగిస్తుంటారు. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి, కడుపులోని వేడిని తగ్గించడంలో సహాయపడుతుందట. కడుపు మంట, అజీర్ణం, ఎసిడిటీ వంటి అనేక సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుందని చెబుతున్నారు. కాగా ఖర్బుజాలో సమృద్ధిగా నీరు ఉంటుందట. ఇందులో విటమిన్ ఎ, సి మంచి మొత్తంలో ఉంటాయట. ఇది చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.