Water Melon: పుచ్చకాయతో వీటిని కలిపి తింటున్నారా.. అయితే జాగ్రత్త?

పుచ్చకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ పుచ్చకాయలు మనకు వేసవిలో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. వే

  • Written By:
  • Updated On - April 2, 2024 / 10:15 PM IST

పుచ్చకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ పుచ్చకాయలు మనకు వేసవిలో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. వేసవికాలంలో రోడ్డు పక్కన ఎక్కడ చూసినా కూడా మనకు విరివిగా లభిస్తూ ఉంటాయి. దీంతో చాలామంది పుచ్చకాయ జ్యూస్ పుచ్చకాయ షర్బత్ అంటూ అనేక విధాలుగా పుచ్చు కాయను తీసుకుంటూ ఉంటారు. పుచ్చకాయ తినడం మంచిదే కానీ పుచ్చకాయతో పాటు కొన్నిరకాల పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. పుచ్చకాయతో పాటు పాల ఉత్పత్తులను తినడం మానుకోవాలి. ఎక్కువ మంది పాలతో చేసిన స్మూతీస్ ను ఇష్టపడి తింటుంటారు.

కానీ దీనివల్ల అనారోగ్యమేకానీ ఆరోగ్యం కలగదు. పాలు, పుచ్చకాయ రెండూ కలిపి తీసుకోవడంవల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వస్తాయి. అలాగే ఉప్పుతో కలిపి తినడం మానుకోవాలి. చాలామంది పుచ్చకాయ రుచిని పెంచడానికి ఉప్పుతో తింటుంటారు. కానీ దీనికి ఉప్పును పూయడం వల్ల శరీరంలో పోషకాలను గ్రహించదు. తినే అలవాటుంటే వెంటనే మానుకోవడం ఉత్తమం. పుచ్చకాయ తిన్న తర్వాత చాలామంది ఆహార ధాన్యాలు తింటుంటారు. కానీ అలా తినకూడదు. పుచ్చకాయ తిన్న 30 నిముషాల వరకు ఆహార ధాన్యాలు తినకూడదు. ఇలా తినడంవల్ల శరీరంలోని పేగులపై ప్రభావం చాలా చెడ్డగా ఉంటుంది.

అంతేకాకుండా విషపూరిత పదార్థాలు నెమ్మదిగా శరీరంలో ఏర్పడటం ప్రారంభిస్తాయి. పుచ్చకాయతో వేయించిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి తీవ్ర నష్టం చేకూరుతుంది. తిన్న వెంటనే హృదయ సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. పుచ్చకాయ తిన్న వెంటనే కోడి గుడ్లను తినకూడదు. చాలా మంది అల్పాహారంగా గుడ్లు తీసుకుంటుంటారు. ఇది తిన్న తర్వాత పుచ్చకాయను తింటారు. కానీ ఈ రెండూ కలిపి తినడంవల్ల ఆరోగ్యానికి పెద్ద డేంజర్. పుచ్చకాయలో 92 % నీరు ఉంటుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఇది కాపాడుతుంది. ఇందులో కెరోటినాయిడ్స్ , బీటాకెరోటిన్, విటమిన్ సి , విటమిన్ ఎ , విటమిన్ బి6 , పొటాషియం, బయోటిన్ ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. గ్లూకోజ్ , ఫ్రక్టోజ్, సుక్రోజ్ కూడా ఉంటాయి.