Site icon HashtagU Telugu

Water Cans: మీరు కూడా వాటర్ క్యాన్ లను ఉపయోగిస్తున్నారా.. అయితే జాగ్రత్త ప్రాణాలకే ప్రమాదం?

Mixcollage 20 Feb 2024 09 14 Pm 6410

Mixcollage 20 Feb 2024 09 14 Pm 6410

ప్రస్తుత రోజుల్లో ప్లాస్టిక్ వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కువగా ప్లాస్టిక్ ని మనం వినియోగిస్తున్నాం. మనం నీరు తాగే వాటర్ క్యాన్ ల నుంచి వాటర్ బాటిల్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా ప్లాస్టిక్. ఇలా మన జీవితమే ప్లాస్టిక్ మయం అవుతుంది. ఇకపోతే మన నిత్యం ఉపయోగించే ప్లాస్టిక్ విషయంపై పరీక్షలు జరపగా, ఒక్కో లీటర్ ప్లాస్టిక్ బాటిల్లో పదివేల ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నట్లు తెలిపింది. మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్లు గుర్తించారు. కొళాయి నీటితో పోల్చి చూసినట్లయితే ప్లాస్టిక్ బాటిల్లో ఉన్న వాటర్ లో ప్లాస్టిక్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

ఇలానే ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ అలాగే పాత్రలో నిలువ ఉన్న నీటిని తాగినట్లయితే క్యాన్సర్ కి దారితీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాగి గ్లాసులోని రాగి బాటిల్స్ ని వాడాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నీటిని నిల్వ ఉంచడానికి మట్టి పాత్రలు లేదా స్టీల్ బిందెలను వినియోగించడం మంచిది. కాబట్టి ఈ ప్లాస్టిక్ వాడడానికి బదులుగా ప్రత్యమ్యాలను వెతుక్కోవడం చాలా మంచిది. ఈ ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు ఎన్నో రకాల సమస్యలను దరిచేరకుండా చేస్తుంది.

అలాగే మీరు తరచుగా ప్లాస్టిక్ వాటర్ క్యాన్లు ఉపయోగిస్తుంటే వాటికి బదులుగా రాగి లేదా స్టీల్, మట్టి పాత్రలను ఉపయోగించడం మంచిది. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడుకోవచ్చు.