Site icon HashtagU Telugu

Use Mobile: రీల్స్ చూస్తూ రాత్రంతా మొబైల్ ఫోన్ లో గడిపేస్తున్నారా.. అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే!

Use Mobile

Use Mobile

టెక్నాలజీ మారిపోవడంతో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇంట్లో కనీసం నాలుగు ఐదు ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్స్ వినియోగం పెరిగిపోయిన తర్వాత తర్వాత చిన్న పిల్లలు నుంచి పెద్దల వరకు అందరూ గంటలకొద్దీ స్మార్ట్ ఫోన్లతోనే గడిపేస్తున్నారు. ముఖ్యంగా రాత్రిళ్ళు రీల్స్ యూట్యూబ్ చూస్తూ రాత్రంగా అలాగే మేలుకొని ఉంటూ తెల్లవారు జామున వరకు మెలుకువగా ఉంటారు. ఈ రోజుల్లో చాలా మంది స్మార్ట్ ఫోన్లకు బానిసలకు మారిపోయారు. చాలా మందికి జీవితంలో స్మార్ట్ ఫోన్లే భాగం అయ్యాయి. ఎంతగా అంటే ఫోన్ లేకుండా ఒక గంట ఉండలేక పోతున్నారు.

ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ల్లో గంటల కొద్దీ గడిపేస్తున్నారు. సోషల్ మీడియాల్లో రీల్స్ ఎక్కువగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇలా రాత్రి అంతా ఫోన్ చూస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నిద్ర సరిగ్గా పట్టకపోవడానికి డోపమైన్ ఏకైక కారణం కాదు. స్మార్ట్ ఫోన్స్ బ్లూ లైట్‌ ను విడుదల చేస్తాయి. ​బ్లూ లైట్ అంటే హై ఎనర్జీ విజిబుల్ లైట్ లేదా HEV స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్, ఎల్‌ఈడీ స్క్రీన్ల నుంచి వెలువతుందట. సూర్యుని నుంచి వచ్చే యూవీ కిరణాలు ఏ విధంగా హాని చేస్తుందో ఈ బ్లూ లైట్ కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు నిపుణులు. బ్లూ లైట్ వల్ల నిద్రలేమి, ఆక్సీకరణ ఒత్తిడి, ఇన్ఫ్లమేషన్, అకాల వ్యద్ధాప్యం వంటి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఇలా అర్థరాత్రి వరకు ఏదైనా స్క్రీన్ చూడటం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం ప్రభావితం అవుతుందని చెబుతున్నారు.

రీల్స్ కంటెంట్ ప్రభావం జీవనశైలి మీద కూడా పడుతుందని చెబుతున్నారు. రీల్స్ ప్రభావం కారణంగా భావోద్వేగాలు అదుపులో లేకపోవడం, వాటిలో వచ్చే కంటెంట్ జీవితానికి తగ్గట్టుగా ఉండాలనుకోవడం,ఆ అంచనాలు నెరవేరనప్పుడు నిరాశ, అసంతృప్తికి గురవ్వడం లాంటివి జరుగుతూ ఉంటారు. అంతేకాకుండా చేసే పనిపై ఆసక్తి కోల్పోవడం, ఉద్యోగంపై దృష్టి పెట్టకపోవడం, విశ్రాంతి లేకపోవడం, మానసిక స్థితిలో మార్పులు వంటివి చాలా మందిలో గమనించడం జరిగిందని చెబుతున్నారు. ఇలా రీల్స్ చూడటం వల్ల చాలా మంది తక్కువ నిద్రపోతున్నారు. తక్కువ నిద్రపోవడం అది ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందట. అంతేకాకుండా స్లీపింగ్ పొజిషన్‌ పై కూడా ఎఫెక్ట్ పడుతుందని చెబుతున్నారు. చాలా మంది రీల్స్ చూస్తూ ఎలా పడితే అలా పడుకుంటున్నారు. ఇలా తప్పుడు భంగిమలో నిద్రపోవడం వల్ల మెడ, కంటిపై ఒత్తిడి పడుతుందట.

రీల్స్ చూసిన తర్వాత మీరు నిద్రపోతే శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్టు అనిపించవచ్చట. కానీ మెదడు కంటెంట్‌ ను హైపర్ యాక్టివ్‌ గా ప్రాసెస్ చేయడం వల్ల దీర్ఘకాలిక నిద్రలేమి, అలసట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా రీల్స్ చూడటం ఒక వ్యసనంగా మారిపోతుంది అని చెబుతున్నారు. అర్థరాత్రి స్క్రీన్ సమయం, పెరుగుతున్న రక్తపోటు స్థాయిల మధ్య సంబంధం. శరీరం ప్రశాంతంగా ఉండాల్సిన సమయంలో మెదడును ఉత్తేజపరిచే రీల్స్ చూడటం వల్ల అది కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల సహజ నియంత్రణకు అంతరాయం కలిగిస్తుందట. ఇది హృదయ స్పందన రేటు పెరుగుదలకు, రక్త నాళాలు కుంచించుకుపోవడానికి, రక్తపోటు పెరగడానికి దారితీస్తుందట. కాలక్రమేణా ఈ అనారోగ్యకరమైన అలవాటు దీర్ఘకాలిక రక్తపోటుకు కారణమవుతుందని చెబుతున్నారు. నిద్రలేమి అనేది అధిక రక్తపోటుకు ఒక కారణం అని చెబుతుంన్నారు.