స్త్రీలకు ప్రతి నెల పీరియడ్స్ రావడం అన్నది సహజం. అయితే ఈ పీరియడ్స్ సమయంలో స్త్రీలు విపరీతమైన కడుపు నొప్పితో పాటు ఇతర సమస్యలతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ పీరియడ్స్ సమయంలోనే చాలా మంది స్త్రీలు తెలిసే తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. కొంతమందికి పీరియడ్స్ సమయం లో ఎలాంటి పనులు చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయంపై సరైన అవగాహన ఉండదు. అటువంటి వాటిలో తల స్నానం చేయడం అన్నది కూడా ఒకటి. మరి పీరియడ్స్ సమయంలో తలస్నానం చేయవచ్చా,చేయకూడదా ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పీరియడ్స్ సమయంలో జుట్టును కడుక్కోవడం వల్ల మహిళలు వంధ్యత్వానికి గురవుతారట. పురాతన కాలంలో మహిళలు నదులు, చెరువులల్లో స్నానం చేసేవారు. ఈ కారణంగా వారు పీరియడ్స్ సమయంలో తలస్నానం చేయడం నిషేధించబడింది. అలాగే పీరియడ్స్ సమయంలో చాలా చల్లని నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణపై ప్రభావం చూపుతుంది. దీంతో కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో తలస్నానం చేయకూడదని చెప్తుంటారు. పీరియడ్స్ సమయంలో తలస్నానం చేయడం వల్ల ఎలాంటి సమస్య ఉండదట. కాకపోతే చల్లని నీటికి బదులుగా గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలని చెబుతున్నారు. ఎందుకంటే గోరువెచ్చని నీరు శరీరానికి విశ్రాంతిని ఇస్తుందట.
అదేవిధంగా పీరియడ్స్ సమయంలో తలస్నానం చేయడం నిషిద్దం. ఎందుకంటే ఈ సమయంలో తలస్నానం చేయడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత మారుతుందని పీరియడ్స్ సమయంలో కాస్త వెచ్చగా ఉండటం కరెక్ట్ గా భావిస్తారట. పీరియడ్స్ తర్వాత జుట్టు కడుక్కోవడం చాలా ముఖ్య అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పీరియడ్స్ సమయంలో శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు ఉత్పత్తి అవుతాయి. అందుకే పీరియడ్స్ తర్వాత జుట్టును, శరీరాన్ని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు.
note: పైన సమాచారం అవగాహన కోసం మాత్రమే. అది పాటించడం అన్నది మీ వ్యక్తిగతం.