Site icon HashtagU Telugu

Alcohol Liver Damage: మీరు మద్యం ప్రియులా.. మీలో ఈ లక్షణాలు కనిపిస్తే లివర్ డ్యామేజ్ అయినట్టే!?

Alcohol And Liver Imresizer

Alcohol And Liver Imresizer

మీరు మద్యం బాగా తాగుతారా? మీలో కొన్ని లక్షణాలు బయటపడితే లివర్ డ్యామేజ్ అయినట్టే. అయితే వాటిని ఎంత తొందరగా గుర్తిస్తే ఆరోగ్యానికి అంత మేలు జరుగుతుంది. ఆ లక్షణాలు ఏమిటి? అవి ఎందుకు తలెత్తుతాయి ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

లివర్ చెడిపోతుంది..

మద్యపానం ఆరోగ్యానికి చాలా హానికరం.. మద్యం తాగడం వల్ల శరీరం క్రమంగా దెబ్బతింటుంది. ముఖ్యంగా లివర్ చెడిపోతుందని.. దీని ద్వారా శరీరం పూర్తిగా అనారోగ్యానికి గురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మద్యం సేవించడం వల్ల సంక్రమించే వ్యాధులలో ఫ్యాటీ లివర్ ఒకటి.. కాలేయ కణాల చుట్టూ చాలా కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కాలేయం సరిగా పనిచేయదు. ప్రతి ముగ్గురిలో దాదాపు ఒకరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఫ్యాటీ లివర్ కారణంగా శరీరంలో అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, థైరాయిడ్ మొదలైన అనేక ఇతర సమస్యలు రావొచ్చు. ఫ్యాటీ లివర్‌లో నాన్ ఆల్కహాలిక్, ఆల్కహాలిక్ అనే రెండు రకాలు ఉన్నాయి. ఆల్కహాల్ ఎక్కువగా మద్యం తాగడం వల్ల ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లక్షణాలను గుర్తించడం, దానికి సకాలంలో చికిత్స ఇవ్వడం అవసరమని వైద్య నిపుణులు అంటున్నారు.

ఫ్యాటీ లివర్ లక్షణాలు..

* కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం..
* శరీర బరువు వేగంగా పెరుగుట
* ఆకలి వేయకపోవడం
* తరచుగా జబ్బుల బారిన పడుతుండటం
* ఉదరం, చీలమండలలో వాపు లాంటి ఫిర్యాదులు
* రక్తపు వాంతులు
* మలంలో రక్తం
* అలసట, మానసిక సమస్యలు
* కడుపు నొప్పి
* ఆల్కహాల్ వల్ల వచ్చే కాలేయ వ్యాధి కాలేయాన్ని మాత్రమే ప్రభావితం చేయదు. ఇది మొత్తం శరీరం ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది.

* గొంతు ఎండిపోవడం, ఆకలి లేకపోవడం, కామెర్లు, వాంతులు కాలేయ వ్యాధికి ప్రారంభ లక్షణాలు.

కాలేయం చేసే పని…

కాలేయం చేసే పని మన కడుపులో చేరిన టాక్సిన్లను విచ్చిన్నం చేయడానికి, విసర్జించే పని చేస్తుంది. కాబట్టి మద్యం తాగితే అతడి కాలేయానికి విసర్జించడం కష్టమవుతుంది. దీంతో ఆ ప్రాంతంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇది కాలేయానికి కొంత నష్టాన్ని సరి చేసి మళ్లీ తన పనిని చేయడం ప్రారంభిస్తుంది. కానీ, మద్యం సేవించడం వల్ల మళ్లీ వస్తుంది.ఇది కేవలం కాలేయాన్ని మాత్రమే ప్రభావితం చేయదు. మొత్తం శరీరాన్ని నాశనం చేస్తుంది. కామెర్లు, ఆఖలి లేకపోవడం, వాంతులు వంటివి లక్షణాలు, దీని తర్వాత కాలేయం వాపు వల్ల కడుపునొప్పి వస్తుంది. వ్యాధి లక్షణాలు కనిపించడానికి 10-15 సంవత్సరాలు పడుతుంది.