Site icon HashtagU Telugu

Weight Loss: ఎక్కువ కష్టపడకుండా ఈజీగా బరువు తగ్గాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే!

Weight Loss

Weight Loss

చాలా మంది బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆహారం తీసుకోవడం మానేయడం, లేదంటే ఆహారం తగ్గించడం, వ్యాయామం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇవి కంటిన్యూస్ గా ఒక వారం చేసే సరికి కష్టంగా అనిపిస్తుందట. నీరసం వచ్చేస్తుందట. అమ్మో మన వల్ల కాదు అని అనిపిస్తుంది. అందుకే చాలా మంది ఎక్కువగా కష్ట పడకుండా ఈజీగా బరువు తగ్గాలి అనుకుంటారు. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఫ్యాటీ లివర్, పెరిగిన కొలెస్ట్రాల్, జీర్ణ సమస్యలు, డిప్రెషన్ వంటి అనేక తీవ్రమైన వ్యాధులకు ఈ సమస్యే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

అందుకే చాలా మంది బరువు తగ్గాలని ప్రయత్నిస్తూ ఉంటారు. బరువు తగ్గేందుకు చాలా మంది రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. అయితే అది అంత సులభం కాదు. బరువు తగ్గించే ప్రక్రియ సుదీర్ఘ ప్రక్రియ. ముఖ్యంగా దీనికి చాలా ఓపిక అవసరం. మీరు వెంటనే బరువు తగ్గాలనుకుంటే అది సాధ్యం కాదు. ఇది చేయడంకోసం మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలట. అల్పాహారం చాలా ముఖ్యం. కానీ మీరు బరువు తగ్గాలంటే, మీరు తప్పనిసరిగా అధిక ప్రోటీన్ కలిగిన అల్పాహారం తినాలి. ఎందుకంటే ఇది తరచుగా తినాలనే కోరికను తగ్గిస్తుందట. మళ్లీ భోజనం చేసే వరకు ఆకలిగా అనిపించదట.

ఉదయం ఖాళీ కడుపుతో రెండు గ్లాసుల గోరువెచ్చని నీటితో మీ రోజును ప్రారంభించాలి. ఇది శరీరానికి శక్తిని అందిస్తుందట. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుందట. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుందట. నీరు లేదా నిమ్మకాయ నీటితో మీ రోజును ప్రారంభించవచ్చట. ఇది జీర్ణ సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుందట. శరీరంలో విటమిన్ డి లేకపోవడం వల్ల బరువు పెరుగుతారట. అందువల్ల, బరువు తగ్గాలనుకునే వారికి ఉదయం సూర్యరశ్మిని సిఫార్సు చేయడం మంచిదట. ఎందుకంటే ఇది విటమిన్ డిని సరఫరా చేస్తుందట. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుందని చెబుతున్నారు. కాగా ఉదయం వ్యాయామం చాలా ముఖ్యం. ఇది బరువును తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుందట. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.