Site icon HashtagU Telugu

Easy Weight Loss : ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా?

Raw Food Benefits

Weight Loss Fiber Diet

అధిక బరువు (Over Weight) సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బరువు ఎక్కువగా ఉంటే తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదమూ ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక బరువు వల్ల డయాబెటిస్‌ (Diabetes), హైపర్‌ టెన్షన్‌ (Hyper Tension), గుండె (Heart) సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే, బరువును కంట్రోల్‌ (Weight Control) లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. బరువు తగ్గడం (Weight Loss), కొంచెం కష్టమైన పనే. కొందరు బరువు తగ్గడానికి కడుపు మాడ్చుకుంటారు, మరికొందరు జిమ్‌లో గంటల తరబడి వర్కవుట్లు చేస్తూ ఉంటారు. చాలామంది నిపుణులు ప్రొటిన్‌ డైట్‌ (Protein Diet) తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారని (Weight Loss) సిఫార్సు చేస్తున్నారు.

ఇవన్నీ పాటిస్తూ ఫైబర్‌ డైట్ (Fiber Diet) తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారని ఫ్యాట్ టు స్లిమ్ (Fat to Slim) డైరెక్టర్‌, డైటీషియన్‌, డైరెక్టర్‌ శిఖా అగర్వాల్‌ అన్నారు. మన ఆహారంలో ఫైబర్‌‌ ఎక్కువగా తీసుకుంటే వెయిట్‌ లాస్‌కు సహాయపడుతుందని డైరెక్టర్‌ శిఖా అగర్వాల్‌ చెప్పారు. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఫైబర్‌ అధికంగా ఉండే కూరగాయలను తీసుకోవాలని అన్నారు.

ఫైబర్‌‌‌‌‌‌ కడుపు, పేగుల పనితీరును మెరుగుపరిచి, బరువు తగ్గించడంలో సహాయ పడుతుందన్నారు. ఫైబర్‌ మనకు మొక్కల నుంచి లభిస్తుంది. దీన్ని మన జీర్ణ వ్యవస్థ సులభంగా విచ్ఛిన్నం చేయలేదు. ఫైబర్‌ విచ్ఛిన్నం అయ్యి, దాన్ని గ్రహించుకునే సమయంలో శరీరం అనవసరమైన ఆహారాన్ని గ్రహించకుండా నిరోధిస్తుంది.

బ్రోకలీ (Broccoli):

బ్రోకలీలో ఫైబర్, విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటుంది. అధ్యయనం ప్రకారం, ఒక కప్పు బ్రోకలీలో ఐదు గ్రాముల ఫైబర్ ఉంటుంది. బ్రోకోలీని సలాడ్స్‌ రూపంలో తీసుకోవచ్చు. దీని టేస్ట్‌ను ఎంజాయ్‌ చేయడానికి నూనె, వెల్లుల్లితో వేయించి తీసుకోండి.

పాలకూర (Spinach):

పాలకూర మన డైట్‌లో తీసుకుంటే.. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాలకూరలో ఆక్సిడేషన్‌‌ ఒత్తిడిని, రక్తపోటును తగ్గిస్తుంది. ఇందులో కరగని ఫైబర్ ఉంటుంది. పాలకూర తరచుగా తీసుకుంటే.. మీరు బరువు తగ్గడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మన ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది.

పచ్చి బఠాణీ (Green Peas):

పచ్చి బఠానీలు పోషకాల స్టోర్‌ హౌస్‌. ఇందులో ఫైబర్, ఐరన్‌, విటమిన్ ఎ, సీ పుష్కలంగా ఉంటాయి. అధిక బరువు సమస్యతో బాధపడేవారు, పచ్చి బఠాణీ వారి డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

బెండకాయ (Ladies Finger):

బెండకాయలో కాల్షియం, పొటాషియం, కార్బస్‌, ప్రొటీన్లు, విటమిన్లు, ఎంజైములు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. బెండకాయ పేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

గుమ్మడి కాయ (Pumpkin):

గుమ్మడి కాయను చాలా మంది ఇష్టపడరు. కానీ, దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి కాయలో కాల్షియం, విటమిన్‌ ఏ, కె వంటి పోషకాలు ఉన్నాయి. దీంతో రకరకాల కూరలు, స్వీట్స్‌, సూప్‌ తయారు చేసుకుని తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి గుమ్మడికాయ బెస్ట్‌ ఆప్షన్‌.

Also Read:  Egg Yellow Yolk : గుడ్డులోని పచ్చసొనను తినకూడదా..?