Site icon HashtagU Telugu

Walking Vs Cycling : నడక మరియు సైక్లింగ్ ఏది ఎక్కువ ప్రయోజనకరం?

World Health Day 2024

Walking Vs Cycling which one is best for health

మనం అందరం వ్యాయామాలు(Exercise) చేయాలి అని అనుకున్నప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేవి నడక(Walking) లేదా సైక్లింగ్(Cycling). ఇవి రెండు మంచి వ్యాయామాలు అయితే వాకింగ్ చేసేటప్పుడు మరీ స్పీడ్ గా కాకుండా మరీ స్లోగా కాకుండా ఒకే స్పీడ్ మెయింటైన్ చేస్తూ చేయాలి. అప్పుడే వాకింగ్ కి మంచి ఫలితం ఉంటుంది. మనం వాకింగ్ చేసినా లేదా సైక్లింగ్ చేసినా రోజుకు ఒక అరగంట చేయాలి. ఈ విధంగా రోజూ క్రమం తప్పకుండా చేయాలి. ఒక అరగంట వాకింగ్ చేయడం వలన శరీరంలో ఖర్చు అయ్యే క్యాలరీలు సైక్లింగ్ చేయడం వలన శరీరంలో ఖర్చు అయ్యే క్యాలరీలు సమానంగా ఉంటాయి.

నడక కంటే సైక్లింగ్ చేయడం వలన మోకాలు, చీల మండల కీళ్ళు తొందరగా అరగవు. సైక్లింగ్ తొక్కేటప్పుడు నిదానంగా కాకుండా స్పీడ్ గా తొక్కాలి. వాకింగ్ కంటే సైక్లింగ్ ఎక్కువసేపు తొక్కుకోవచ్చు. సైకిల్ తొక్కడం రాని వారు వాకింగ్ చేయవచ్చు. సైకిల్ తొక్కడం వలన సత్తువ పెరుగుతుంది. సైక్లింగ్ చేయడం వలన కండరాలకు రక్తప్రసరణ పెరుగుతుంది.

సైక్లింగ్ చేయడం వలన గుండె మరియు ఊపిరితిత్తులకు మంచిది. ఊపిరితిత్తుల సామర్ధ్యం పెరుగుతుంది. సైక్లింగ్ చేయడం వలన శారీరక బలం కూడా పెరుగుతుంది. తుంటి, కాలు, తొడ కండరాలు సైక్లింగ్ చేయడం వలన బలంగా మారతాయి. వాకింగ్ చేయడం కంటే సైక్లింగ్ చేయడం వలన ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. కానీ మనం వాకింగ్ చేసినా సైక్లింగ్ చేసినా ఏదయినా క్రమం తప్పకుండా చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది.

 

Also Read : Bengaluru : జేబులో ఫోన్ పెట్టుకుంటున్నారా..? అయితే జాగ్రత్త ఎందుకంటే…!!