Site icon HashtagU Telugu

Walking: నిద్రపోయే ముందు వాకింగ్ చేస్తే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసా

Walking Benefits

Walking Benefits

Walking: కదలకుండా ఉండడం ఆరోగ్యానికి చాలా హానీ చేస్తుంది. అయితే నిద్రపోయే ముందు కొద్దిసేపు నడవడం ఆరోగ్యానికి మంచిదని మీకు తెలుసా. ఆహారం తిన్న తర్వాత నడక చాలా ముఖ్యం. మీరు నిద్రపోయే ముందు నడకను అలవాటుగా చేసుకుంటే అది మీ నిద్ర విధానాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో మనసు ప్రశాంతంగా ఉండి మంచి నిద్ర వస్తుంది.

సాయంత్రం నడక ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. ఇది మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, డిప్రెషన్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ నిద్రపోయే ముందు వాకింగ్ చేయడం వల్ల క్యాలరీలు కరిగిపోతాయి. ఇది బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. నిద్రపోయే ముందు రోజూ వాకింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీంతోపాటు బీపీ కూడా అదుపులో ఉంటుంది.

నడక కండరాలను, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కూడా అందిస్తుంది. ఈవినింగ్ వాక్ చేసేటప్పుడు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. రాత్రి భోజనం చేసిన 2 గంటల తర్వాత మాత్రమే నడక కోసం బయటకు వెళ్లండి. చాలా వేగంగా నడవకండి. సౌకర్యవంతమైన బట్టలు మరియు బూట్లు ధరించండి. సాయంత్రం నడక జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది ఆహారం జీర్ణం కావడానికి కూడా చాలా సహాయపడుతుంది. కాబట్టి, తిన్న వెంటనే నిద్రపోకూడదు.