Site icon HashtagU Telugu

‎Blood Sugar: భోజనం చేసిన వెంటనే ఈ విధంగా చేస్తే చాలు షుగర్ కంట్రోల్ అవ్వడం కాయం!

Blood Sugar

Blood Sugar

‎‎Blood Sugar: మామూలుగా భోజనం చేసిన తర్వాత చాలామంది కూర్చోవడం లేదంటే పడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. రాత్రి సమయంలో అయితే కొంతమంది లేచి అలా కొద్దిసేపు వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇలా తిన్న తరువాత కొద్దిసేపు అలా నడవడం వల్ల ఆహారం జీర్ణం అవుతుందట. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు తిన్న తర్వాత ఎప్పుడు అలాగే కూర్చోకూడదు. ఇలా చేస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయట.

‎అందుకే తిన్న తర్వాత కాసేపు అలా వాకింగ్ చేయాలని చెబుతున్నారు. తిన్న తర్వాత కేవలం వాకింగ్ చేయడం మాత్రమే కాకుండా ఇంకా కొన్ని పనులు చేస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగవాట. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయాన్ని వస్తే.. కాళ్ల మడమలను పైకి లేపి కిందకి దించడం వల్ల గ్లూకోజ్ కండరాలలోకి వెళ్లడానికి సహాయపడుతుందట. ఇది రక్తంలో చక్కెర పెరగడాన్ని కంట్రోల్ చేస్తుందని చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత తేలికపాటి శారీరక శ్రమ చేయడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉంటాయట. కాబట్టి తేలికపాటి నడక లేదా, వ్యాయామం చేయడం మంచిదని చెబుతున్నారు.

‎ తేలికపాటి వ్యాయామం రక్త ప్రసరణను పెంచుతుందట. ఇది పొట్ట, పేగులలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని,జీర్ణక్రియను సజావుగా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు. అలాగే తిన్న తర్వాత తేలికపాటి నడక లేదా ఒకే చోట మార్చ్ చేయడం వల్ల పొట్ట ఉబ్బరం, బరువు తగ్గడానికి సహాయపడుతుందట. భోజనం చేసిన తర్వాత కొంచెం కదలడం మంచిది. రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుందని జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెబుతున్నారు. పైన చెప్పిన చిన్న చిన్న పనులు చేయడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండడం మాత్రమే కాదు బరువును కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు అని చెబుతున్నారు.

Exit mobile version