Site icon HashtagU Telugu

Vomiting While Travelling: జర్నీలో వాంతులా.. అయితే మీ పక్కన ఈ వస్తువులు ఉండాల్సిందే?

Vomiting While Travelling

Vomiting While Travelling

సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో దూర ప్రయాణాలు జర్నీలు చేస్తూనే ఉంటారు. పర్సనల్ పనుల మీద లేదంటే టూర్లకు ఏదో ఒక విషయం మీద ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది జర్నీ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. మరికొందరికి జర్నీ ఇష్టం ఉన్నా కూడా జర్నీ చేస్తే వాంతులు అవుతాయి అన్ని ఎక్కడికి వెళ్ళకుండా వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా నలుగురితో వెళ్లాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. కొందరికి బస్సులు కార్లు సుమోలు లాంటి వాహనాలలో ప్రయాణిస్తే వాంతులు అవుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఎక్కువగా బస్సులలో ప్రయాణించే వారికి వాంతులు అవుతూ ఉంటాయి.

ఒకవేళ అటువంటి వారు వెళ్లాల్సి వచ్చినా కూడా కిటికీ దగ్గర కూర్చుంటారు. అయితే వాహనాలలో వచ్చే చెడు స్మెల్ వల్ల కూడా కొన్నిసార్లు వాంతులు అవుతూ ఉంటాయి. పురుషులతో పోల్చుకుంటే మహిళలు ఎక్కువగా ఇలా వాంతులు చేసుకుంటూ ఉంటారు. ఇందుకు గల కారణం మన చెవుల్లో ఉండే లాబ్రింథైన్ క్లీన్ గా లేకపోవడం వల్ల కూడా వాంతులు అవుతాయి. చెవుల్లో మురికి పోరుకుపోవడం వల్ల మెదడుకు అందాల్సిన సంకేతాలు చేరకపోవడంతో వికారం, తలనొప్పి వంటి సమస్యలు వచ్చి వాంతులు అవుతూ ఉంటాయి. అయితే అలా వాంతి సమస్యతో బాధపడేవారు మీతో పాటు ఈ మూడు రకాల వస్తువులను తీసుకొని వెళ్లడం వల్ల మీకు ఎటువంటి సమస్యలు ఉండవు.

అరటిపండు.. జర్నీలో వాంతి చేసుకునేవారు అరటి పనులు తీసుకొని వాంతులు వచ్చినట్లయితే వెంటనే అరటిపండు తినండి. ఇలా చేయడం వల్ల వాంతి వచ్చే సమస్య తగ్గుతుంది. నిమ్మకాయలు జర్నీలో వాంతులు వచ్చినట్టుగా అనిపించినప్పుడు వెంటనే లెమన్ వాటర్ తాగడం వల్ల వాంతులు రావడం తగ్గిపోతాయి. అల్లం.. ఇది కూడా వాంతులను ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి జర్నీ చేసేవారు అల్లం టీ లేదా అల్లంతో తయారు చేసిన స్వీట్ ని తీసుకోవడం వల్ల వాంతి సమస్య తగ్గుతుంది.