Site icon HashtagU Telugu

Vitamin C: విటమిన్ సి లోపం ఉంటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Vitamin C

Vitamin C

శరీరానికి ఎన్నో రకాల పోషకాలతో పాటు విటమిన్లు కూడా అవసరం. వాటిలో విటమిన్ సి కూడా ఒకటి. విటమిన్ సి మనకు ఎన్నో రకాల పండ్లలో లభిస్తుంది. విటమిన్ సి మన శరీరం నిర్మాణంలో చాలా కీలకపాత్ర పోషిస్తుంది అన్న విషయం తెలిసిందే. అందుకే రోజు వారి డైట్ లో తప్పకుండా విటమిన్ సీను చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే శరీరంలో విటమిన్ సి లోపిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

విటమిన్ సి అనేది శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్‌ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ కారణంగా గాయాలు త్వరగా మానుతాయట. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుందట. విటమిన్ సి ఉండే ఆహారం తీసుకుంటే చర్మం మృదువుగా, నిగనిగలాడుతూ ఉంటుందట. విటమిన్ సి లోపం ఉంటే తక్కువ వయస్సుకే వృద్ధాప్య లక్షణాలు కన్పిస్తాయట. చర్మం సంబంధిత సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. అందుకే విటమిన్ సి ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు తప్పకుండా తీసుకోవాలి. ఇక విటమిన్ సి లోపముంటే దంత సమస్య కూడా ఎదురౌతుందట.

పళ్లు లూజ్ అయిపోయి, చిగుళ్లు బలహీనంగా మారి రక్తం కారుతూ ఉంటుందని చెబుతున్నారు. అలాగే రెడ్ బ్లడ్ సెల్స్ సంఖ్య తగ్గుతుందట. దాంతో త్వరగానే అలసిపోతుంటారని చెబుతున్నారు. శరీరంలో విటమిన్ సి కొరత ఏర్పడితే చర్మం ఎర్రబడటం, దద్దుర్లు రావడం, నోరు, పెదాలు, చర్మం అదే పనిగా డ్రై అవడం లాంటి సమస్యలు వస్తాయట. విటమిన్ సి లోపం ఉంటే రక్త ప్రసరణలో అంతరాయం కలుగుతుందని చెబుతున్నారు. అలాగే విటమిన్ సి లోపం కారణంగా జుట్టు త్వరగా రాలిపోతుందట. చర్మం కూడా పొడిబారుతుందని చెబుతున్నారు. చర్మం పెలుసుగా ఉండటం, నిర్జీవంగా ఉండటం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చట. వెంట్రుకలు బలహీనమై రాలిపోతాయట. చిగుళ్ల సమస్య కూడా రావచ్చని చెబుతున్నారు. కాబట్టి పైన చెప్పిన సమస్యలు రాకూడదు అంటే మీ డైట్ లో తప్పనిసరిగా విటమిన్ సి ని చేర్చుకోవాల్సిందే. అలాగే ఎప్పుడూ కూడా విటమిన్ సి ని నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు. విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ కమలా, ఉసిరి వంటి సిట్రస్ జాతికి చెందిన పండ్లను తరచుగా తీసుకోవాలని చెబుతున్నారు.