Benefits Of Vitamin B6: విటమిన్ బి6 తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

సాధారణంగా చాలామంది చిన్న చిన్న విషయాలకి మూడ్ ఆఫ్ అవడం, మానసిక ఒత్తిడికిలోనవుతూ ఉంటారు. అయితే

  • Written By:
  • Updated On - July 27, 2022 / 10:32 AM IST

సాధారణంగా చాలామంది చిన్న చిన్న విషయాలకి మూడ్ ఆఫ్ అవడం, మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో విటమిన్ బి6 మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా, మూడ్స్ ని కంట్రోల్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా శరీరం ప్రోటీన్ లను గ్రహించడంలో కూడా సహాయపడుతుంది. మరి విటమిన్​ బి6 లోపం ఏర్పడకుండా ఉండాలి అంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. క్యారెట్ లో విటమిన్ బి6 ఎక్కువగా ఉంటుంది. క్యారెట్ శరీరానికి అవసరమైన ఫైబర్ అలాగే కళ్ళని ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఏ కూడా ఇందులో లభిస్తుంది.

అదేవిధంగా విటమిన్ బి6 కోసం మాత్రమే కాకుండా బరువు తగ్గాలి అనుకున్న వారు ప్రతి రోజు ఒక అరటిపండును తినాలి. ఈ అరటి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్​ హెల్త్​కు మంచివి. పాలకూరలో విటమిన్​ బి6తో పాటు ఐరన్, ఫోలేట్​, పొటాషియం వంటి న్యూట్రియెంట్స్ కూడా ఉంటాయి. చలికాలంలో పాలకూరను తరచుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అదేవిధంగా చలికాలంలో గుడ్లు తింటే ఒళ్లంతా వెచ్చగా ఉంటుంది. బ్రేక్​ఫాస్ట్​లో ఆమ్లెట్​ లేదా ఉడకబెట్టిన గుడ్లు తింటే విటమిన్​ బి6 లోపం ఏర్పడదు. పచ్చి బఠాణీల్లో విటమిన్​ బి6 ఎక్కువగా ఉంటుంది. వీటిని సలాడ్స్​ లేదా సైడ్ డిష్​గా క్యారెట్లు, ఆలుగడ్డలతో కలిపి తినవచ్చు.

క్యాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్‌నట్స్​, అవకాడోలో విటమిన్​బి6 పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో హార్మోన్లు కూడా బ్యాలెన్స్​ అవుతాయి. అలాగే టొమాటోలో విటమిన్ బి6 ఎక్కువగా ఉంటుంది. ఇవి చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే టొమాటోలో ఉండే లైకోపిన్​ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. కీరదోసలో కూడా విటమిన్​బి6 పుష్కలంగా ఉంటుంది. బీన్స్​ని రెగ్యులర్​గా తింటే బి6 లోపం దరిచేరదు. అలాగే మనం తినే డైట్ లో శెనగలు, చేపలను చేర్చినా బి6 లోపం నుంచి తప్పించుకోవచ్చు. రోజూ పాలు తాగితే కూడా విటమిన్​ బి6 తగ్గకుండా చూసుకోవచ్చు. అలాగే చికెన్​ లివర్​ తిన్నా విటమిన్​ బి6 తో పాటు ఫోలేట్​, ఐరన్​ వంటివి దొరుకుతాయి.