‎Night Sweats: రాత్రిళ్లు నిద్రలో చెమట ఎక్కువగా పడుతోందా.. అయితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

‎రాత్రిళ్ళు నిద్రలో చెమట ఎక్కువగా పట్టడం అంత మంచిది కాదని, ఇది కొన్ని రకాల సమస్యలకు సంకేతం అని, దీనిని అసలు నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Night Sweats

Night Sweats

‎Night Sweats: మారుతున్న జీవనశైలికి అనుగుణంగా మనుషుల ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయాయి. దీంతో జీవనశైలిలో బిజీబిజీ అయిపోయి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేస్తున్నారు. వాటివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చిన్న వయసు వారినే లేనిపోని సమస్యలు ఇబ్బంది పడుతున్నాయి. అటువంటి వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే సమస్య కూడా ఒకటి. చాలామందికి రాత్రిళ్లు నిద్రలో విపరీతమైన చెమట వస్తూ ఉంటుంది. అయితే ఇందుకు గల కారణం విటమిన్ బి 12. విటమిన్ బి12 శరీర నిర్మాణానికి, ఆరోగ్యంగా ఉండటానికి చాలా ముఖ్యం.

‎విటమిన్ బి12 అనేది ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, నరాల వ్యవస్థ ఆరోగ్యం, DNA సంశ్లేషణకు అవసరమైన ఒక ముఖ్యమైన విటమిన్. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి నుండి నాడీ వ్యవస్థను చురుగ్గా ఉంచడం వరకు విటమిన్ బి12 ప్రధాన పాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. విటమిన్ బి12 లోపం వల్ల రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు అధిక చెమట పడుతుందట. అయితే చాలామంది దీనిని కేవలం వేడి అని భావిస్తారు.కానీ విటమిన్ బి12 లోపం నాడీ వ్యవస్థ దెబ్బతినడం, బలహీనత, అలసట, చేతులు, కాళ్ళలో జలదరింపు, నోటి పూతలు రక్తహీనత వంటి ఇతర సమస్యలను కూడా కలిగిస్తుందని చెబుతున్నారు.

‎కొన్నిసార్లు రాత్రిపూట అకస్మాత్తుగా కళ్ళు మసకబారడం లేదా చీకటిలో వస్తువులను గుర్తించడంలో ఇబ్బంది ఎదురవ్వడం లాంటివన్నీ కూడా విటమిన్ బి12 లోపానికి సంకేతాలు అని చెబుతున్నారు. నాడీ వ్యవస్థ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. కానీ కొన్నిసార్లు విటమిన్ బి12 లోపం నరాలను దెబ్బతీస్తుందట. దీనివల్ల అధిక చెమట వస్తుందని చెబుతున్నారు. ఇలా రాత్రిళ్ళు అధికంగా చెమట వస్తున్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు. వెంటనే వైద్యులను సంప్రదించాలట. అలాగే కొన్ని సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి అని చెబుతున్నారు. విటమిన్ బి12 లోపాన్ని తీర్చడానికి, పాల ఉత్పత్తులు, గుడ్డు సొనలు, బలవర్థకమైన ఆహారాలు, చేపలు, సముద్ర ఆహారం, చికెన్‌ను మీ ఆహారంలో చేర్చుకోవాలట. శాఖాహారులకు తృణధాన్యాలు మంచి మూలం. లోపం ఏర్పడినప్పుడు రక్తహీనత, నరాల సమస్యలు తలెత్తవచ్చట. అందుకే ఈ ఆహారాలను మీ ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకోవడం వల్ల విటమిన్ బి12 లోపం వచ్చే ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు.

  Last Updated: 14 Oct 2025, 09:51 AM IST