Site icon HashtagU Telugu

Vitamin B12 Deficiency: ఈ ఆరోగ్య సమస్యలకు విటమిన్ బి12 లోపమే కారణం..

Vitamin Deficency

Vitamin Deficency

శరీరం ఎలాంటి పోషకాహార లోపం లేకపోతేనే అన్ని విధాలుగా సక్రమంగా పనిచేస్తుంది. విటమిన్ ఏది లోపించిన కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్య శరీరంపై దాడి చేస్తుంది. శరీరానికి అవసరమైన, అత్యవసరమైన పోషకాలలో విటమిన్ బి12 (Vitamin B12) ఒకటి. ఇది మన DNA సంశ్లేషణలో సహాయపడే ఒక ముఖ్యమైన పోషకం. శక్తి ఉత్పత్తిలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరుకు సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా దీని పాత్ర చాలా ప్రధానమైనది. శరీరంలో విటమిన్ బి12 (Vitamin B12) తగినంత స్థాయిలో లేకపోతే శరీరంపై అనేక రకాలుగా ఆ ప్రభావం కనిపిస్తుంది.

అలసట:

శరీరంలో విటమిన్ బి12 లోపించినప్పుడు శరీరమంతా ఆక్సిజన్ ప్రవహించే వ్యవస్థ పై ప్రభావం పడుతుంది. ఆక్సిజన్ డెలివరీ కణాలకు సరిగ్గా కాకపోతే అది రక్తహీనతకు దారితీస్తుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కూడా తగ్గడంతో మెగాలోబ్లాస్టిక్ అనిమియా అనే సమస్య వస్తుంది. దీనివల్ల రక్తహీనతతో పాటు అలసట, తలనొప్పి, మూడు స్వింగ్స్ వంటి సమస్యలు వస్తాయి.

జీర్ణ సమస్యలు:

విటమిన్ బి12ను కేవలం ఆహారం నుంచి మాత్రమే మన శరీరం పొందగలదు. పొట్టలోని హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఎంజైమ్‌లు, విటమిన్ బి12ను ఆహారం నుంచి విడదీయడంలో సహాయపడతాయి. విటమిన్ బి12 లోపిస్తే జీర్ణవ్యవస్థ పై ఆ ప్రభావం పడుతుంది. జీర్ణాశయంలో తగినంత ఆక్సిజన్ అందదు. ఇది అతిసారం, వికారం, మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్, ఆకలి లేకపోవడం, హఠాత్తుగా బరువు తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది.

నరాలకు నష్టం:

విటమిన్ బి12 నాడీ వ్యవస్థ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. నాడీ వ్యవస్థ అంటే నరాల వ్యవస్థ …ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సిన ముఖ్యమైన పోషకం విటమిన్ బి12. ఇదే శరీరంలో లోపిస్తే శాశ్వత నాడీ సంబంధిత నష్టానికి దారితీస్తుంది అని ఒక అధ్యయనం చెబుతోంది. నరాల సమస్యలు ఒక్కసారి వస్తే వాటిని తగ్గించడం చాలా కష్టం. అందుకే ఎలాంటి నరాలకు నష్టం లేకుండా విటమిన్ బి12 పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చర్మం పసుపు రంగులోకి మారడం, గొంతు నాలుక ఎర్రబారడం, నోటి పూతలు రావడం, నడిచే విధానంలో మార్పులు రావడం, కళ్ళు సరిగా కనబడకపోవడం, చిరాకు, నిరాశ వంటివి కలుగుతాయి.

విటమిన్ బి1వ లోపిస్తే రక్తహీనత కలుగుతుందని ముందే చెప్పాము. దీన్నే కోబాలమిన్ లోపం అంటారు. శరీరం ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు తయారు చేయలేనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చర్మం రంగును ప్రభావితం చేస్తుంది. దీనివల్ల చర్మం లేత పసుపు రంగులోకి మారతాయి. నోటిలో కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. నాలుక పై వాపు రావడం,  మంటలాంటి భావన కలగడం జరుగుతుంది. నోట్లో జలదరింపు, ఏదైనా సూదిగా ఉండే వస్తువులు గుచ్చుకున్నట్టు అనిపించడం కూడా విటమిన్ బి12 లోపాన్ని సూచిస్తాయి.

Also Read:  Legs: కాళ్ళల్లో వాపు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి..