Vinegar for Home: ఇంట్లో ఎక్కడ చూసినా కూడా చీమలు ఉన్నాయా.. అయితే వెనిగర్ తో ఇలా చేయాల్సిందే?

మామూలుగా మనకు ఇంట్లో నల్ల చీమలు, ఎర్ర చీమలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నల్ల చీముల వల్ల ఇబ్బంది లేకపోయినా ఎర్ర చీమలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

Published By: HashtagU Telugu Desk
Mixcollage 30 Jan 2024 08 31 Pm 5915

Mixcollage 30 Jan 2024 08 31 Pm 5915

మామూలుగా మనకు ఇంట్లో నల్ల చీమలు, ఎర్ర చీమలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నల్ల చీముల వల్ల ఇబ్బంది లేకపోయినా ఎర్ర చీమలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా అవి కుడితే చాలు ఎర్రటి దద్దులు వచ్చి దురద పెడుతూ ఉంటుంది. ఎర్ర చీమలు అన్ని రకాల పదార్థాలకు పట్టి తినడానికి కూడా వీలు కాకుండా చేస్తూ ఉంటాయి. దాంతో చాలా మంది ఎర్ర చీమలకు చెక్ పెట్టడం కోసం చాక్ పీసులు స్ప్రేలు వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఈ టీములు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. మరి అలాంటప్పుడు చీమలకు శాశ్వతంగా ఎలా చెప్పి పెట్టారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే కేవలం ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ అన్ని పనులు చక్క బెడుతుందట.

ముఖ్యంగా వెనిగర్ తో చీమల సమస్యకు చెక్ పెట్టవచ్చట..వంటగదిలోని గోడలు లేదా టేబుల్స్‌పై మొండి మరకలను తొలగించడానికి వెనిగర్ ఉపయోగించవచ్చు. వెనిగర్‌ని నీటితో కలిపి వంటగది మొత్తాన్ని శుభ్రం చేస్తే జిడ్డు మరకలన్నీ తొలగిపోతాయి. బట్టలు దుర్వాసన వస్తుంటే బట్టలు ఉతికేటప్పుడు వెనిగర్ ఉపయోగించవచ్చు. బట్టలు ఉతుకుతున్నప్పుడు ఒక కప్పు వెనిగర్‌ను సబ్బు నీటిలో కలపాలి. ఇది బట్టల చెడు వాసనలను తొలగిస్తుంది. ఇంటి దుర్వాసనను తొలగించేందుకు కూడా వెనిగర్ ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో వెనిగర్ పోసి గది మూలలో ఉంచండి. ఇది గది నుంచి వచ్చే దుర్వాసనలను తొలగిస్తుంది.

అంతే కాకుండా వెనిగర్ నీళ్లలో కలిపి ఇంటి తలుపులు, కిటికీలను శుభ్రం చేసుకోవచ్చు. వెనిగర్ ఇంటిని శుభ్రపరచడంతో పాటు, జుట్టు మెరుపును పెంచుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్‌ని నీటిలో కలిపి తలకు, జుట్టుకు స్ప్రే చేయండి. ఇది జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది. అలాగే మార్కెట్‌ నుంచి పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసిన తర్వాత, వాటిని సాధారణ నీటిలో కడిగేటప్పుడు ఆ నీటిలో కొన్ని చుక్కల వెనిగర్ కలపండి. వెనిగర్ కలిపిన నీటితో పండ్లు, కూరగాయలను కడగడం వల్ల వాటిపై ఉన్న రసాయనాలన్నీ సులువుగా తొలగిపోతాయి. ఇంట్లో చీమల బెడద పెరిగిందా? అయితే నీరు, వెనిగర్‌లను సమాన భాగాలుగా కలిపి, ఈ మిశ్రమాన్ని చీమలపై స్ప్రే చేయాలి. అంతే చీమలతోపాటు ఇంట్లో పురుగుల బెడద కూడా అంతమవుతుంది. కీటకాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ నీటిని పిచికారీ చేస్తే కీటకాలు ఇంట్లోకి రావు.

  Last Updated: 30 Jan 2024, 08:32 PM IST