Vegan Eggs : వెజిటేరియన్స్ కోసం.. గుడ్డులందు ఈ గుడ్డు వేరయా !

శనగపప్పును నానబెట్టి.. దానిని గ్రైండ్ చేసి అందులో పెరీపెరీ మసాలా, మ్యాగీ మసాలా, కొద్దిగా నూనె, నీళ్లు, పసుపు కలిపిన మిశ్రమంతో గుడ్డు లోపల ఉండే పచ్చసొనను

  • Written By:
  • Publish Date - October 29, 2023 / 08:03 PM IST

Vegan Eggs : నాన్ వెజ్ ప్రియులు కోరిన ఆహారం తినొచ్చు. కానీ.. వెజిటేరియన్స్ అలా కాదు. గుడ్డు వాసన కూడా వాళ్లకు పడదు. మిగతా నాన్ వెజ్ రకాల గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే వారి కోసం వేగన్ చికెన్, మటన్ లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు వేగన్ ఎగ్ కూడా వచ్చేసింది. ఇది కోడి పెట్టని గుడ్డు. కోడి పెట్టని గుడ్డా ? అదెలా ఉంటుందని ఆశ్చర్యపోకండి.

పప్పులు, పన్నీర్, సుగంధ ద్రవ్యాలతో తయారుచేసే ఈ గుడ్లు అచ్చం కోడిగుడ్లలాగే ఉంటాయి. కోడిగుడ్లను, వీటిని కలిపి ఉంచితే ఏవి నిజమైన కోడిగుడ్లో, ఏవి కృత్రిమ కోడిగుడ్లో కూడా గుర్తించలేరు. మరి ఈ వేగన్ గుడ్లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా.

శనగపప్పును నానబెట్టి.. దానిని గ్రైండ్ చేసి అందులో పెరీపెరీ మసాలా, మ్యాగీ మసాలా, కొద్దిగా నూనె, నీళ్లు, పసుపు కలిపిన మిశ్రమంతో గుడ్డు లోపల ఉండే పచ్చసొనను తయారు చేస్తారు. మలైకోవాలో మొక్కజొన్న పిండి, రాక్ సాల్ట్ వేసి బాగా కలిపి.. తెల్లభాగాన్ని తయారు చేస్తారు. దాని మధ్యలో శనగపప్పుతో చేసిన మిశ్రమాన్ని ఉంచి గుడ్డులా తయారు చేస్తారు. ఈ తయారుచేసి పెట్టుకున్న గుడ్డును రాక్ సాల్ట్ నీటిలోనే ఉడకబెట్టాలి. సరిగ్గా ఐదునిమిషాల్లో గుడ్డు ఉడికిపోతుంది. రుచికి రుచి, పోషకాలకు పోషకాలూ ఈ వేగన్ గుడ్డులో ఉంటాయంటున్నారు ఆహార నిపుణులు. నవంబర్ 1వ తేదీన ప్రపంచ వేగాన్ దినోత్సవం సందర్భంగా శాకాహారం తినాలనుకునేవారు ఈ గుడ్డును ట్రై చేసి చూడండి.