Site icon HashtagU Telugu

Vamu : బరువు తగ్గాలనుకున్నవారు వామును ఇలా తీసుకుంటే చాలు నెలలోనే 20 కేజీలు తగ్గడం ఖాయం?

Mixcollage 26 Jan 2024 05 17 Pm 449

Mixcollage 26 Jan 2024 05 17 Pm 449

మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో వాము తప్పనిసరిగా ఉంటుంది. ఈ వామును ఎన్నో రకాల ఆహార పదార్థాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వాముని కొన్ని ప్రదేశాలలో ఓమా అని కూడా పిలుస్తారు. దీని తరచూ తీసుకోవడం వల్ల ఆజీర్తి గ్యాస్ ట్రబుల్ కడుపునొప్పి మలబద్ధకం లాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా బాలింతలు ఈ వామును ఎక్కువగా తినమని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వును వాము కరిగిస్తుంది. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను వాము కలిగిస్తుంది. బరువు తగ్గాలి అనుకున్న వారికి వాము అద్భుతంగా పనిచేస్తుంది.

చాలామంది ఎంతో కష్టపడి జిమ్ లో వర్కవుట్లు చేస్తుంటారు. డైట్ ఫాలో అవుతుంటారు. చాలా కసరత్తులు చేస్తుంటారు. కానీ ఏమాత్రం ప్రయోజనం ఉండదు. బరువు మాత్రం అస్సలు తగ్గరు. అటువంటి వాళ్లు వామును ఇలా తీసుకుంటే వద్దన్నా బరువు తగ్గవచ్చు. వామును ముందుగా కొంచెం తీసుకొని ఒక గిన్నెలో వేసి బాగా వేడి చేయాలి. కాసేపు అయ్యాక వామును చల్లార్చి ఎండిపోయిన కరివేపాకు రిబ్బలను కూడా తీసుకొని వాటిని మిక్సీలో గ్రైండ్ చేసుకొని మెత్తగా పౌడర్ లా చేసుకోవాలి. ఆ పౌడర్ ను రోజూ ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగుతూ ఉండాలి.

ఇలా రోజూ ఒక గ్లాస్ వాము పౌడర్ నీటిని తాగడం వల్ల శరీరంలో ఊహించని పరిణామాలు జరుగుతాయి. శరీరంలో ఉండే అనవసర కొవ్వు మొత్తం కరిగిపోతుంది. రోజూ చేసే కసరత్తులతో పాటు ఈ వాము నీళ్లను కూడా తీసుకుంటే నెల రోజుల్లోనే 20 కిలోల వరకు తగ్గవచ్చు. వాము వల్ల జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. జీవ క్రియ మెరుగుపడుతుంది. పేగులు శుభ్రం అవుతాయి. గ్యాస్ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. ఒకవైపు బరువు తగ్గడంతో పాటు జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. అందుకే వామును ప్రతి రోజూ మీ ఆహారంలో భాగం చేసుకోవాలి.