Teeth Tips: మీ పళ్ళు తల తల మెరిసిపోవాలంటే ఈ పదార్థాలు తినాల్సిందే?

మామూలుగా ముఖం ఎంత అందంగా ఉన్నా కూడా చిరునవ్వు ఆ ముఖానికి మరింత అందాన్ని తెస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి మనం నవ్వి

  • Written By:
  • Publish Date - December 12, 2023 / 06:10 PM IST

మామూలుగా ముఖం ఎంత అందంగా ఉన్నా కూడా చిరునవ్వు ఆ ముఖానికి మరింత అందాన్ని తెస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి మనం నవ్వితే ముందుగా కనిపించేది మన పళ్ళు. మాములుగా మనలో చాలామంది తెల్లటి పళ్ళు కలిగి ఉంటారు. చాలామంది గార పళ్ళతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా పళ్ళు గారగా పచ్చగా ఉన్నప్పుడు నలుగురిలోకి వెళ్లాలి అన్న నలుగురితో మాట్లాడాలి అన్నా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మిల మిల మెరిసే పళ్ళు కావాలి అని చాలామంది అనేక రకాల చిట్కాలను, టూత్ పేస్టులను ఉపయోగిస్తూ ఉంటారు.

అయినా కూడా పల్లపై ఉండే గార తొలగిపోలేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే పళ్ళు మిలమిల మెరవాలి అంటే కొన్ని ఆహారాలు తీసుకుంటే చాలు అని వైద్య నిపుణులు చెప్తున్నారు. మరి తెల్లటి పళ్ళు సొంతం కావాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది ఉదయం పళ్ళు శుభ్రం చేసుకునేటప్పుడు ఏదో శుభ్రం చేసుకోవాలి అంటే శుభ్రం చేసుకోవాలి అన్నట్టుగా బ్రష్ చేస్తూ ఉంటారు. కొంతమంది పళ్ళు తెల్లగా అవ్వాలని కళ్ళతో ఒక చిన్నపాటి యుద్ధమే చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం అస్సలు మంచిది కాదు. అయితే మరి పళ్ళు తెల్లగా అవ్వాలి అన్న నోటి దుర్వాసన పోవాలి అంటే ఎటువంటి ఆహార పదార్థాలు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

క్యారెట్ లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యారెట్ రోజు తీసుకోవడం వల్ల దంతాల పై పేర్కొన్న పసుపుపచ్చ రంగు తొలగిపోతుంది. ఇది పళ్ళకు మంచి మెరుపుని ఇస్తుంది. క్యారెట్ తీసుకోవడం వల్ల లాలాజలం ఉత్పత్తి కూడా అధికమవుతుంది. ఇది దంతాల్ని శుభ్రపరుస్తుంది. ఆపిల్ తీసుకోవడం వల్ల దంతాలు శుభ్రపడతాయి నోటి దుర్వాసన నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆపిల్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది టూత్ బ్రష్ గా పనిచేస్తూ ఉంటుంది. దంతాల నుంచి పసుపురంగుని తొలగిస్తుంది. ఉల్లిపాయలు శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి దంత క్షయాన్ని కారణమయ్యే నోటి బాక్టీరియాని నాశనం చేయిస్తాయి. సలాడ్ రూపంలో ఉల్లిపాయలు తీసుకుంటే చాలా మంచిది. స్ట్రాబెరీలు మాలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. మాలిక్ యాసిడ్ను టూత్ పేస్ట్ తయారు లోను వాడుతూ ఉంటారు. ఇది న్యాచురల్ రక్తస్రావ నివారిణిగా ఉపయోగపడుతుంది. పళ్ళు మూలాలలో పలకాన్ని తొలగిస్తుంది. దీనిలో ఉండే సిట్రిక్ యాసిడ్ దంతాలను మెరిసిపోయేలా చేస్తుంది. కాగా స్ట్రాబెర్రి లతో పోలిస్తే పుచ్చకాయలు మాలిక్ యాసిడ్ పరిమాణం ఇంకా అధికంగా ఉంటుంది మాలిక్ యాసిడ్ మీదంతాలను తెల్లగా మార్చడంలో లాలాజల ఉత్పత్తిని ప్రోత్సహించడంలో ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో ఉండే ఫైబర్ మీ దంతాలను స్క్రబ్లా చేస్తుంది. దంతాలపై ఉన్న మరకలను పోగొడుతుంది.