Site icon HashtagU Telugu

Perfumes: పెర్ఫ్యూమ్స్ అధికంగా ఉపయోగిస్తున్నారా.. అయితే జాగ్రత్త?

Perfumes

Perfumes

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా ప్రతి ఒక్కరూ మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ఫేస్ క్రీమ్స్ సోప్స్, పెర్ఫ్యూమ్స్, జెల్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా పర్‌ఫ్యూమ్‌ వాడడం అన్నది పెద్ద రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఆడ, మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ పర్‌ఫ్యూమ్‌ లను వినియోగిస్తున్నారు. అంతే కాకుండా మగవారికి సపరేట్ ఆడవారికి సపరేట్ అంటూ రకరకాల పర్‌ఫ్యూమ్‌ వచ్చాయి. అయితే కొందరు సెంట్లు ఉపయోగిస్తే, మరికొందరు అత్తరు లాంటివి కూడా వినియోగిస్తారు. అయితే ఎక్కువ మంది మాత్రం పర్‌ఫ్యూమ్‌ లనే ఉపయోగిస్తూఉంటారు.అయితే ఎక్కువ శాతం చెమట నుంచి వచ్చే దుర్వాసన రాకుండా ఉండేందుకు పర్ ఫ్యూమ్ లు వాడుతుంటారు.

మరికొందరు స్టైల్ కోసం వినియోగిస్తుంటారు. అయితే పర్‌ఫ్యూమ్‌ లను మితిమీరి ఉపయోగించడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ లు కూడా వస్తాయి..అయితే పర్‌ఫ్యూమ్‌ లను వినియోగించే ముందు ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. సువాసన మనసుకు ప్రశాంతతను చేకూర్చేలా అలాగే గాఢత ఎక్కువ సమయం నిలిచి ఉండేలా చూసుకోవడం ముఖ్యం. అలాంటి పర్‌ఫ్యూమ్ వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే సీజన్‌ను బట్టి పర్‌ఫ్యూమ్‌లను మారుస్తూ ఉండాలి. కానీ చాలామంది అలా కాకుండా ఒకేసారి ఒకే రకమైన పర్ఫ్యూమ్ లు చాలా తెచ్చుకొని వాటిని చాలా రోజులు ఉపయోగిస్తూ ఉంటారు. వేసవి కాలంలో చర్మం ఎక్కువ తేమగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో కంటే వేసవిలోనే పర్‌ఫ్యూమ్‌ వాసన ఎక్కువ సమయం ఉంటుంది.

కాబట్టి తక్కువ గాఢత ఉండే పర్‌ఫ్యూమ్‌లను సమ్మర్ లో, ఎక్కువ గాఢత ఉండే వాటిని చలికాలంలో ఉపయోగించడం మంచిది. గాఢత మరీ ఎక్కువగా ఉండే పర్‌ఫ్యూమ్‌ల వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అయితే మనం గాఢత ఎక్కువగా ఉండే పెర్ఫ్యూమ్లను ఉపయోగించడం వల్ల పక్క వ్యక్తులకు ఇబ్బందిగా అనిపించడంతోపాటు వారికి అలర్జీ లాంటివి కూడా వస్తూ ఉంటాయి. పర్‌ఫ్యూమ్ లు ఎక్కువగా వాడే వారికీ చర్మ సంబంధ సమస్యలు వస్తుంటాయి. పర్‌ఫ్యూమ్ ల తయారీలో వాడతున్న రసాయనాలతో మానసిక సమస్యలు కూడా వస్తాయి. మంచి వాసన వస్తోందని అతిగా పర్‌ఫ్యూమ్స్ ఉపయోగించడం వల్ల చర్మవ్యాధులతో పాటు ముక్కు, కళ్లు, గొంతు నొప్పి, మతిమరుపు, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.