Mobile In Toilet: టాయిలెట్‌లో మొబైల్ వాడే అలవాటుందా..?ఈ వార్త చదువుతే సుస్సు పోసుకుంటారు

  • Written By:
  • Publish Date - April 18, 2023 / 11:30 AM IST

నేటి కాలంలో మొబైల్ ఫోన్ (Mobile In Toilet) లేనిది ఒక్కక్షణం గడపలేరు. మొబైల్ అత్యవసర సాధనంగా మారింది. ఫోన్ ఏ పనిచేయాలన్నా కష్టంగా మారుతుంది. ఆఫీసు పనుల నుంచి మార్కెట్లో తీసుకువచ్చే కూరగాయల వరకు అన్ని పనులు కూడా ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా జరుగుతుంటాయి. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు చేతిలో మొబైల్ ఉండాల్సిందే. మొబైల్ మన జీవితంలో అంతగా పాతుకుపోయింది. దీన్ని మన జీవితంలో నుంచి వేరు చేయడం ఎవరి తరం కాదు. కానీ ఈ రోగాల గురించి తెలుస్తే మాత్రం ముట్టుకోవాలంటే జంకుతారు.

కొంతమంది టాయిలెట్ సీట్‌లో కూర్చుని మొబైల్‌లో గేమ్‌లు ఆడుతుంటారు.. వీడియోలు చూస్తుంటారు. ఇలాంటి పనులు అస్సలు మంచివి కాదు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా హానికరమని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు మొబైల్ ను టాయిలెట్ లో ఉపయోగించడం వల్ల కలిగే పర్యవసానాల గురించి తెలుస్తే మీరు షాక్ తింటారు.

టాయిలెట్‌లో మొబైల్ ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు ఇవే.

బ్యాక్టీరియా ప్రమాదం :

టాయిలెట్‌లో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. మొబైల్ వాడుతూ టాయిలెట్ లో కూర్చున్నప్పుడు.. ఆ చేత్తోనే మగ్, జెట్ స్ప్రే, టాయిలెట్ కవర్, ఫ్లష్ బటన్‌ను ముట్టుకోవల్సి వస్తుంది. వాటికున్న హానికరమైన బ్యాక్టీరియా అంతా కూడా మన చేతులకు అట్టుకుంటుంది. టాయిలెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకుంటారు. కానీ మొబైల్ ను శుభ్రం చేయలేరు కదా. దీనివల్ల మళ్లీ మీరు స్మార్ట్ ఫోన్ను మట్టుకున్నప్పుడు, తినే సమయంలో బ్యాక్టీరియా అంతాకూడా మీ కడుపులోకి వెళ్తుంది. దీంతో కడుపునొప్పి, మలబద్దకం, అజీర్ణం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

డయేరియా:

టాయిలెట్లోకి మొబైల్ ను తీసుకెళ్లడ వల్ల అది బ్యాక్టీరియాతో నిండిపోతుంది. తినేటప్పుడు మొబైల్ ఉపయోగించకుండా తినలేము కదా. ఈ బ్యాక్టీరియా మొబైల్ రూపంలో మన కడుపులోని పేగుల్లోకి చేరి విరేచనాలు వంటి సమస్యలకు దారి తీస్తుంది.

పైల్స్:

పైల్స్ రావడానికి కారణాలు ఎన్నైనా ఉండవచ్చు. సాధారణంగా బలహీనమైన వ్యాకోచం వల్ల ఏర్పడతాయి. టాయిలెట్‌లో మొబైల్ ఫోన్లు వాడితే ఈ వ్యాధి తీవ్రం అవుతుంది. మీ మలద్వారం నుంచి రక్తం, పురీషనాళంలో చాలా మంట వంటి సమస్యలకు కారణం అవుతుంది. టాయిలెట్‌లో నిరంతరం కూర్చోవడం వల్ల, తొడ కండరాలపై చెడు ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.