అంజీర్ పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండుగను తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పండ్లలో విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తాయి. వీటిని పచ్చిగా, డ్రై ఫ్రూట్స్‌గా కూడా వాడతారు. అయితే, అంజీర ఆకులతోనూ అనేక లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ఈ పండ్లతో పాటు అంజీర ఆకులు కూడా అద్భుత పోషకాల గని అంటున్నారు.
అంజీర ఆకులలో అపారమైన యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయట. ఆ ఆకుల రసం ద్వారా సహజ పద్ధతిలో కూడా శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంజీర్ ఆకుల్లోని ఔషధ గుణాలు మలబద్ధక సమస్యలు నుంచి ఉపశమనం కలిగిస్తాయట. అంజీర పండ్లలలాగానే ఆకుల్లో కూడా పొటాషియం, సోడియం, ఫాస్పొరిక్ ఆమ్లం, ఐరన్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందుకే ఆకుల కషాయాలు, టీ, రసం, ఎండు ఆకులతో పొడి రూపంలో వివిధ అనారోగ్య సమస్య చికిత్సలో వినియోగించవచ్చు.
అంజీర్ పండ్లే కాదు, ఆకులతో చేసిన కషాయం, రసం, టీ చాలా మేలు చేస్తుందట. అంజీర్ ఆకులను ఎండబెట్టి పొడి చేసుకొని అర చెంచా పొడిని ఒక కప్పు నీళ్లలో కలిపి టీ లాగా తాగాలట. రెండు విధానాలు అపారమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయని చెబుతున్నారు. ఎముకలు బలహీనంగా ఉంటే అంజీర్ ఆకులను తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ఈ ఆకులతో తయారు చేసిన పొడిని తీసుకోవడం వల్ల శరీరానికి పొటాషియం, కాల్షియం లభించి చాలా ఎముకలు దృఢంగా మారుతాయి. ఇందుకోసం అంజీర్ ఆకుల పొడిని ఉపయోగించాలని చెబుతున్నారు.