Holy Basil: పదకొండు రకాల సమస్యలను తరిమికొట్టే ఆకులు.. పూర్తి వివరాలు ఇవే!

భారతీయులు,హిందువులు పురాతన కాలం నుంచే తులసి చెట్టుని పవిత్రమైన మొక్క గా భావించి భావిస్తారు. అదేవిధంగా

  • Written By:
  • Publish Date - August 17, 2022 / 06:24 AM IST

భారతీయులు,హిందువులు పురాతన కాలం నుంచే తులసి చెట్టుని పవిత్రమైన మొక్క గా భావించి భావిస్తారు. అదేవిధంగా కేవలం పూజ కోసం మాత్రమే కాకుండా తులసి మొక్కను ఆరోగ్యానికి కావలసిన ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. తులసిలో ఆయుర్వేదం ప్రకారం ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా తులసి ఆకులతో అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేయవచ్చు. మరి తులసి ఆకులను ఎలా ఉపయోగించాలి ? తులసి ఆకుల వల్ల ఎటువంటి సమస్యలు నయం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలా మందిని అధిక కఫం సమస్యతో బాధపడుతూ ఉంటారు. గొంతులో కఫం బాగా ఉండడం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోవడం,ఎక్కువ సేపు మాట్లిడితే దగ్గు ఎక్కువగా రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ తులసి ఆకులతో ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అందుకు గాను రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగు తులసి ఆకులను నోట్లో వేసుకుని నేరుగా అలాగే నమిలి మింగేయడం వల్ల కఫం సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే జీర్ణాశయం, పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములను నాశనం చేసే శక్తి తులసి ఆకులకు ఉంటుంది. కనుక రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగు తులసి ఆకులను నోట్లో వేసుకుని నమిలి మింగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు.

తులసి ఆకులను పరగడుపునే తినడం వల్ల రక్తం బాగా తయారవుతుంది. తద్వారా రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే తులసి ఆకులను బాగా కడిగి శుభ్రం చేసి,వాటిని నీడలో ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని కొద్దిగా తీసుకుని అందులో నీళ్లు కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీంతో రోజూ దంతాలను తోముకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే దంతాలపై ఉండే గార, పసుపు తనం పోయి దంతాలు తెల్లగా మారి మెరుస్తాయి. అలాగే చిగుళ్ల నుంచి కారే రక్తస్రావం కూడా తగ్గుతుంది. తద్వారా చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే నోట్లో సూక్ష్మ క్రిములు చనిపోతాయి. అలాగే నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది.

దగ్గు, జలుబు, జ్వరం ఉన్నప్పుడు ఒక టీస్పూన్‌ తులసి ఆకుల రసంలో అంతే మోతాదులో తేనె కలిపి రోజుకు మూడు పూటలా తీసుకోవాలి. నాలుగైదు తులసి ఆకులు, నాలుగైదు పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజుకు రెండు సార్లు.. ఉదయం, సాయంత్రం ఒక కప్పు మోతాదులో తాగడం వల్ల జ్వరం తగ్గుతుంది. తులసి ఆకుల రసం, ఉల్లిపాయ రసం, అల్లం రసం, తేనెలను కలిపి ఈ మిశ్రమాన్ని ఆరు టీస్పూన్‌ల మోతాదులో రోజుకు రెండు సార్లు,ఉదయం, సాయంత్రం తాగడం వల్ల విరేచనాలు తగ్గుతాయి. రాత్రి పూట ఒక గ్లాస్‌ పలుచని మజ్జిగలో కాస్త తులసి ఆకుల రసం వేసి తీసుకోవాలి. రోజూ ఇలా చేస్తే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.