Site icon HashtagU Telugu

E. Coli in Keema Meat: ఖీమా మాంసంలోని E. Coli తో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గండం!

Urinary Tract Infections With E.coli In Keema Meat!

Urinary Tract Infections With E.coli In Keema Meat!

E. Coli in Keema Meat : యునైటెడ్ స్టేట్స్‌లో ప్రతి సంవత్సరం మాంసం బ్యాక్టీరియా వల్ల 5 లక్షల మందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ (UTI) కలుగు తున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. UTI బాధితులకు దీనివల్ల మరణాల ముప్పు కూడా పెరుగుతోందని గుర్తించారు.

E. Coli అంటే ఏమిటి?

E. కోలి అంటే.. ఎస్చెరిచియా కోలి బ్యాక్టీరియా. ఇది మనుషుల పేగులతో పాటు కొన్ని జంతువులలోనూ నివసిస్తుంది.  చాలా రకాల E. coli బ్యాక్టీరియాలు మనకు హాని చేయవు. ఇవి మన జీర్ణవ్యవస్థను నిర్వహించడంలో కూడా సహాయపడతాయి. మీరు కలుషితమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు లేదా కలుషితమైన నీటిని తాగినప్పుడు, కొన్ని జాతుల E. Coli బ్యాక్టీరియాలు విరేచనాలకు కారణమవుతాయి.

మనలో చాలామంది ఇ.కోలి బ్యాక్టీరియాకు ఫుడ్ పాయిజనింగ్‌తో లింక్ పెడతారు. అయితే వివిధ రకాల ఇ.కోలి బ్యాక్టీరియాలు న్యుమోనియా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి.75% నుంచి 95% మూత్ర మార్గానికి సంబం ధించిన అంటువ్యాధులు E. coli వల్ల సంభవిస్తాయని అంచనా.

E. coli సాధారణంగా ప్రేగులలో కనిపిస్తుంది. ఈ మార్గం ద్వారానే ఇది మూత్ర నాళంలోకి ప్రవేశిస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ (UTI) కు FZEC లేదా ఆహారం ద్వారా వచ్చే జూనోటిక్ E Coli బ్యాక్టీరియా కారణం అవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.బ్రిటీష్ సొసైటీ ఫర్ యాంటీ మైక్రోబియల్ కెమోథెరపీ (BSAC) ప్రకారం.. UKలోని మొత్తం స్త్రీలలో దాదాపు సగం మంది తమ జీవితకాలంలో కనీసం ఒకసారి UTI ప్రాబ్లమ్ ను ఎదుర్కొంటున్నరు.

భారతదేశంలో..

భారతదేశంలో పిండిచేసిన మాంసాన్ని  ఖీమా అని పిలుస్తారు. సాధారణంగా మటన్ నుండి దీన్ని తయారు చేస్తారు.మాంసం ద్వారా సంక్రమించే E. కోలి జాతుల వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయని గుర్తించారు. ఇండోర్ షెడ్లలో జంతువులను పెద్ద సంఖ్యలో పెంచడం వల్ల వాటి మధ్య సులువుగా, వేగంగా E. కోలి బ్యాక్టీరియా వ్యాపిస్తోందని వెల్లడైంది. ఇలాంటి E. కోలి బ్యాక్టీరియాలు యాంటీ బయాటిక్ చికిత్సకు కూడా రోగ నిరోధకతను కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Also Read:  Highest Railway Bridge in the World: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన పై నుంచి ట్రైన్ రన్