Diet and Cancer: ఈ ఆహారపు అలవాట్లు క్యాన్సర్ కు కారణమౌతాయని మీకు తెలుసా…?

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతునే ఉంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ఈ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ మధ్య కాలంలో రకరకాల క్యాన్సర్లు వెలుగులోకి వస్తున్నాయి. మహిళలు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడుతున్నారు.

  • Written By:
  • Publish Date - February 4, 2022 / 07:45 AM IST

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతునే ఉంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ఈ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ మధ్య కాలంలో రకరకాల క్యాన్సర్లు వెలుగులోకి వస్తున్నాయి. మహిళలు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడుతున్నారు. ఇక ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది చాలా సాధారణంగా మారింది. మనకు తెలియకుండానే మనం తీసుకుంటున్న కొన్ని ఆహారపదార్థాలు, మన అలవాట్ల కారణంగా కూడా క్యాన్సన్ బారిన పడే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ క్యాన్సర్ మన దరికి చేరకుండా ఉండేందుకు ఎలాంటి లైఫ్ స్టైల్ అలవర్చుకోవాలి. ఇప్పుడు తెలుసుకుందాం.

* సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడంతోపాటు…నూనెలో ఎక్కువగా ఫ్రై చేసే ఫుడ్స్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. దీని బారిన పడకుండా ఉండేందుకు…ఇలాంటి ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి.

* చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది. కానీ ఉప్పు వేసిన చేపలను ఎక్కువ సేపు ఉంచి తినకూడదట. అంతేకాలం ఎక్కువ కాలం ప్రిసర్వ్ చేసిన చేపలో ఉప్పు వేసి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ ప్రిసర్వేటిక్స్ కారణంతో శరీరంలో క్యాన్సర్ కణాలు పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందట.

* ఆహారం పూర్తిగా ఉడికిన తర్వాతే తినాలి అనుకుంటాం. కానీ అతిగా ఉడికిచ్చిన ఆహారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా అతిగా ఉడికిచ్చిన మాంసాన్ని తినడం వల్ల క్యాన్సర్ కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి, గ్రిల్లింగ్, ప్యాన్ ఫ్రై, బార్బీక్యూ వంటి ఆహార పదార్థాలను ఎంత తక్కువ తీసుకుంటే మన ఆరోగ్యానికి అంతమంచిది.

* ఇక అతిగా మద్యం సేవించడం అనేది కూడా క్యాన్సర్ దారితీయవచ్చని పరిశోధనల్లో తేలింది. కేవలం ఆల్కహాల్ మాత్రమే కాదు…విపరీతంగా శీతలపానీయాలు తాగడం వల్ల కూడా క్యాన్సర్ ఎటాక్ చేసే అవకాశం ఉంటుందట.

* వీటితోపాటుగా శరీరానికి వ్యాయాయం అనేది చాలా అవసరం. కానీ చాలామంది వ్యాయామం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు. ఇలా శరీరానికి సరిపడా వ్యాయామం లేకపోయినట్లయితే శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయి క్యాన్సర్ లాంటి కణాలు పెరగడానికి కారణం అవుతాయి.

* అంతేకాదు…విపరీతమైన ఒత్తిడితో బాధపడేవారిలోనూ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. మద్యం సేవించడం, పొగతాగడం వంటివి చేస్తే శరీరానికి ఎంత హాని కలుగుతుందో…ఒత్తిడి కూడా అంతే ఎఫెక్ట్ చూపిస్తుందట.

కాబట్టి లైఫ్ స్టైల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి. ప్రస్తుత రోజుల్లో బయటి ఆహారానికి దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది. పండ్లు, కూరగాయలు, ఇంటి ఆహారానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లయితే రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.