Menstruation: రుతుక్రమాన్ని…అర్థం చేసుకుని..మసలుకోవడం ఉత్తమం..!!

మహిళలను ప్రతినెలా రుతుక్రమం పలకరిస్తూనే ఉంటుంది. సాధారణంగా కొందరిలో 28 రోజులకు వస్తే...మరికొందరిలో 24రోజులకే వస్తుంది.

  • Written By:
  • Publish Date - May 27, 2022 / 07:00 AM IST

మహిళలను ప్రతినెలా రుతుక్రమం పలకరిస్తూనే ఉంటుంది. సాధారణంగా కొందరిలో 28 రోజులకు వస్తే…మరికొందరిలో 24రోజులకే వస్తుంది. అంతేకాదు కొందరికి 35రోజులకు కూడా రావొచ్చు. ఇవి రెండూ సాధారణమే. కానీ నెలసరి సమయంలో శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. వీటిని అర్థం చేసుకుని..మసలుకోవడం చాలా అవసరం..సాధారణంగా నాలుగు దశల్లో ఈ రుతుచక్రం ఉంటుంది. ఎలాగో తెలుసుకుందాం.

రుతుస్రావ దశ:
సాధారణంగా ఇది 1-5రోజుల వరకు ఉంటుంది. చాలామందికి 3 నుంచి 5 రోజుల పాటు బహిష్టు కావొచ్చు. కానీ కొందరిలో ఇది 2రోజులే అవుతుంది. కొందరికి 7 రోజులూ సాగొచ్చు.

అండం తయారయ్యే దశ:
ఇది 6 నుంచి 14రోజుల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ పెరుగుతుంది. ఇది గర్భాశయ గొడ మందమయ్యేలా చేస్తుంది. ఎఫ్ఎస్ హెచ్ అనే మరో హార్మోన్ మూలంగా అండాశయాల్లో ఫాలికల్స్ ఏర్పడతాయి. వీటిల్లో ఒక దాంట్లోనే అండం పరిపక్వత చెందుతుంది.

అండం విడుదలయ్యే దశ:
ఇది సుమారు 14రోజులకు ప్రారంభం అవుతుంది. ల్యూటినైజింగ్ హార్మోన్ స్థాయిలు హఠాత్తుగా పెరిగి అండం రిలీజ్ అయ్యేలా ప్రేరేపిస్తుంది.

వ్యాయామం:
* అధిక రుతుస్రావం, విపరీతమైన పొత్తికడుపునొప్పి లాంటి ఇబ్బందులు ఏవీ లేకపోతే…రుతుస్రావం అవుతున్నరోజుల్లో తేలికైన వ్యాయామాలు, యోగాసనాలు చేయడం మంచిది. నెమ్మదిగా కండరాలను సాగదీసే వ్యాయామాలు నొప్పి తగ్గడానికి తోడ్పడతాయి.
*అండం విడుదలకు శరీరం సన్నద్దమయ్యే రోజుల్లో పరుగు, సైకిల్ తొక్కడం వంటివి చేయవచ్చు. ఇవి శక్తి మరింత పెరిగేలా చేస్తాయి. పొత్తికడుపు నొప్పి వంటి లక్షణాలు ఉన్నవారైతే నెమ్మదిగా నడవడం మేలు. అండం రిలీజ్ అయ్యే సమయంలో జిమ్ లో కష్టమైన వ్యాయామాలు చేయవచ్చు.

ఆహారం మీద ధ్యాస:
నెలసరి వచ్చాక మొదటి రెండు వారాల వరకు ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతుంటాయి. తర్వాత తగ్గుతాయి. రెండు వారాల నుంచి మూడన్నర వారాల వరకు ప్రొజెస్టిరాన్ హార్మోన్ మోతాదులు పెరుగుతుంటాయి. తర్వాత తగ్గుతాయి. టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిలు స్థిరంగానే ఉంటాయి. కానీ మధ్యలో కొన్ని రోజులుపాటు పెరుగుతుంటాయి. ఇవి కొందరిలో పొత్తికడుపు నొప్పికి కారణం అవుతుంటాయి. ఆహారం విషయంలో శ్రద్ధ పెడితే వీటిని తగ్గించుకోవచ్చు.

నెలసరికి ముందు:
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో ఉన్న పదార్థాలను తీసుకోవడం మంచిది. ఇవి పొత్తికడుపు నొప్పిని తగ్గించడానికి తోడ్పతాయి. అవిసె గింజలు, కొవ్వుతో కూడిన చేపలు, చియా గింజలు, ఆక్రోట్స్, గంగావాయిలి కూరలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో ఉండే కెఫిన్ పొత్తి కడుపు నొప్పి ఎక్కువయ్యేలా చేస్తుంది.

రుతుస్రావం అవుతున్నప్పుడు:
రక్తంలో గ్లూకోజు ఆలస్యంగా కలిసేలా చేసే పిండిపదార్థాలను తీసుకోవాలి. ఉదాహరణకు దంపుడు బియ్యం, పొట్టుతీయని గోధుమలు, చిరుధాన్యాలు వంటివి. ఇవి శక్తి సన్నగిల్లకుండా చూస్తాయి.
ఐరణ్ ఎక్కువగా లభించే పాలకూర, మాంసం వంటివి తినాలి. విటమిన్ సితో కూడిన బత్తాయిలు, నారింజ, జామ, ఉసిరి వంటివి కూడా తీసుకుంటే శరీరం ఐరన్ను బాగా గ్రహించుకుంటుంది.