Site icon HashtagU Telugu

Unhealthy Gut: జీర్ణసమస్యలు తరచూ వేదిస్తున్నాయా.. అయితే మీకు ఆ సమస్య ఉన్నట్లే?

Loose Motions Remedies

Unhealthy Gut

సాధారణంగా చాలామందిని జీర్ణ సమస్యలు తరచూ వేధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ కారణంగా ఈ రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. జీర్ణ సమస్యలకు గల ముఖ్య కారణాలు తక్కువ నిద్ర, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం, ఎక్కువగా షుగర్ ఫుడ్స్ తీసుకోవడం, యాంటీ బయాటిక్స్ అధికంగా ఉపయోగించడం అలాంటి వాటి వల్ల ఈ జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మరి తరచూ జీర్ణ సమస్యలు తలెత్తుతుంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జీర్ణ సమస్యల సాధారణ లక్షణాలు కడుపు ఉబ్బరం, మలబద్ధకం, విరోచనాలు, కడుపు నొప్పి. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ లక్షణాలు జీర్ణ సమస్యలకి సూచన.

అయితే, గట్ హెల్త్ బాగుందో లేదో తెలుసుకోవడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. కొన్ని లక్షణాల ద్వారా సమస్యని గుర్తించవచ్చు. మీ గట్ హెల్త్ బాగుండకపోతే మీకు ఎక్కువగా స్వీట్స్ తినాలనిపిస్తుంది. ఇవి స్వీట్స్, బ్రెడ్, పండ్లు, డెయిరీ ప్రోడక్ట్స్ వల్ల ఉంటాయి. ఎక్కువగా షుగర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల గట్‌లో చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని వల్ల సమస్య పెరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన గట్, బ్రెయిన్ మధ్య ఒక లింక్ ఉంటుంది. నిజానికీ, గట్ తరచుగా రెండో మొదడు అంటారు. గట్ సూక్ష్మ జీవులు నాడీ వ్యవస్థ, ఎండోక్రైన్ వ్యవస్థ, ఇమ్యూనిటీతో కమ్యూనికేట్ చేస్తాయి. దీంతో మీ మానసిక స్థితి, మీరు ఎలా ప్రవర్తిస్తారో అనేదాన్ని ప్రభావితం చేస్తాయి.ఈ రకమైన ఆహార విధానం గట్ మైక్రోబియల్ వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

గట్ ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది. మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే కడుపులో ఆహారం జీర్ణం చేయడంలో ఇబ్బందిగా ఉంటే వస్తుంది. మీ గట్ మైక్రోబయోమ్‌లో మార్పుల వల్ల ఫుడ్ తినాలనిపించదు. అంతేకాకుండా.. అతిసారం, పొత్తికడుపు తిమ్మిరి, ఉబ్బిరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ఇది కొన్ని ఫుడ్స్ తినడం వల్ల వస్తాయి. అది ఏ ఫుడ్ వల్ల వస్తున్నాయో కనుక్కోండి. కొన్ని రోజుల పాటు దానిని తినకండి. సమస్య తగ్గాక చిన్న పరిమాణంలో తినాలి. అయినా సమస్య మళ్ళీ వస్తే ఆ ఫుడ్‌ని తినకపోవడమే మంచిది. అయితే, ఈ సమస్యల పరిష్కారానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇందుకోసం మెడిటేషన్, నడవడం, సన్నిహితులతో కాలం గడపడం, ఆల్కహాల్, పొగత్రాగడానికి దూరంగా ఉండడం, నవ్వడం, యోగా, పెంపుడు జంతువులతో కాలం గడపడం వంటివి చేయవచ్చు. అలాగే మంచి నిద్ర కూడా జీర్ణ సమస్యల్ని దూరం చేస్తుంది. ఇది గట్ హెల్త్‌ని కాపాడుతుంది. అలాగే ఫాస్ట్ ఫుడ్లను తినడం పూర్తిగా తగ్గించేయాలి.