Site icon HashtagU Telugu

Belly Fat: పొట్ట చుట్టూ కొవ్వుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఈ విధంగా చేయండి!

Belly Fat

Belly Fat

ప్రస్తుత రోజుల్లో పొట్ట చుట్టూ కొవ్వు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు చాలామంది ఉన్నారు. అయితే శరీరంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు డయాబెటీస్, షుగర్, బీపీ, లివర్ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక ఈ కొవ్వును కరిగించుకోవడానికి చాలా మంది రకరకాల డ్రింక్స్, డైట్ లు ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది మెడిసిన్స్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను ఉపయోగించి ఈ పొట్ట చుట్టూ కొవ్వును కరిగించుకోవచ్చు అని చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సన్‌బాత్ పద్ధతి ద్వారా ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకుండా కొవ్వు తగ్గించుకోవచ్చట.

కాగా ఎండ నుంచి వైటమిన్ డి లభిస్తుంది. అది ఎముకలను మరింత బలంగా మార్చడానికి దోహదపడుతుందట. ఇందుకోసం ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి టెర్రస్‌ పై ఎండలో కొన్ని నిమిషాలు ఉండడం వల్ల శరీరం పై పడే సూర్య కిరణాలు మొత్తం బాడీని ఆరోగ్యవంతంగా మారుస్తుందట. వైటమిన్ డి ఒక్కటి మాత్రమే కాదు. చర్మానికి కూడా ఈ ఎండ చాలా మంచిదని చెబుతున్నారు. అలాగే వేసవికాలంలో రోడ్లపై వీధుల్లో ఎక్కడపడితే అక్కడ చక్కెరతో తయారు చేసే జ్యూస్ లను ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. అవి ఎక్కువగా తాగడం వల్ల కొవ్వు పెరుగుతుంది. ఆ జ్యుస్‌ లలో ఐస్ వాటర్ కూడా కలపడంతో కొవ్వు పెరిగేందుకు వీలు కల్పిస్తుంది. కాబట్టి కాబట్టి ఇలాంటి జ్యూస్‌ లను సేవించకపోవడమే మంచిదని చెబుతున్నారు. వీటికి బదులుగా కొబ్బరినీళ్లు మజ్జిగ, బత్తాయి జ్యూస్ వంటివి తాగడం వల్ల ఎండ నుంచి ఉపశమనం పొందవచ్చట.

మానసిక ఒత్తిడి పెరిగితే శరీరంలో కార్టిసాల్ ఉత్పత్తి అవుతుందట. కార్టిసాజ్ వల్ల శరీర బరువు కూడా పెరుగుతుందట. రోజూ పది నిమిషాలు మెడిటేషన్ చేస్తే మానసిక ఒత్తిడి తగ్గి కార్టిసాల్ ఉత్పత్తి కాకుండా ఉంటుందట. దీంతో బరువు పెరిగే అవకాశాలు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు. అలాగే ప్రతీ రోజూ నిద్ర లేవగానే ఒక గ్లాసులో గోరువెచ్చని నీళ్లు తీసుకొని అందులో ఒక చెంచా తేనె కొంత నిమ్మరసం పిండుకొని తాగాలి. ఇలా ప్రతీ రోజూ చేస్తే 15 రోజుల తరువాత మీ శరీరంలో జరిగే మార్పును పొట్టపై, పొట్ట చుట్టూ పెరిగే కొవ్వును తగ్గడం మీరే గమనించవచ్చు అని చెబుతున్నారు. అలాగే సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. సరైన నిద్ర లేకపోవడం వల్ల కొన్ని రకాల హార్మోన్లు ఉత్పత్తయ్యి బరువు పెరగడానికి కారణమవుతుందట. ఈ హార్మోన్ల వల్ల ఆకలి కూడా పెరుగుతుందట. దీంతో ఎక్కువగా తినడం వల్ల కూడా బరువు పెరుగుతారని, కాబట్టి రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలని చెబుతున్నారు. అలాగే ప్రతీ రోజు జాగింగ్ మీరు ఇంట్లో నుండే చేసుకోవచ్చట. ఇది చేయడానికి మీకు థ్రెడ్‌మిల్, ప్రత్యేకమైన షూస్ కూడా అవసరం లేదు. ఉదయం లేవగానే నీళ్లు తాగి, బ్రష్ చేసుకున్న తరువాత మీ రూంలో ఉన్న చోటనే నిలబడి అక్కడే జాగింగ్ చేయాలి. ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా జాగింగ్ చేయాలి. జాగింగ్ ఎలా చేస్తామో మొత్తం అదే పద్ధతిలో చేయాలి. ఇలా చేస్తే ఈజీగా బెల్లీ ఫ్యాట్ కరుగుతుందని చెబుతున్నారు.