Site icon HashtagU Telugu

Less Sleep and Diabetes: తక్కువ నిద్రపోతున్నారా..?డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ..!!

Diabetes Test Imresizer

Diabetes Test Imresizer

షుగర్, హైబీపీ ఈ రెండూ కూడా వయస్సుతో సంబంధం లేకుండా అటాక్ట్ చేస్తుంటాయి. ముఖ్యంగా వయస్సు పెరిగినా కొద్దీ శరీరంపై దాడిచేసేందుకు రెడీగా ఉంటాయి. వాటి బారినపడకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ముఖ్యం. మంచి ఆహారంతోపాటు కంటినిండా నిద్రపోవాలి. నిద్రవేళలు ఏమాత్రం తగ్గకూడదు. అలాగని…గంటల కొద్దీ పడుకోకూడదు. ఎనిమిది గంటలపాటు నిద్ర చాలా అవసరం. పది గంటల కంటే ఎక్కువ…ఏడుగంటల కంటే తక్కువ నిద్రపోయినా…శరీరంలో ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా షుగర్, నిద్రకు మధ్య విడదీయలేని సంబంధం ఉంటుంది. ఒక్కరోజు సరిగ్గా నిద్రపోకపోయినా..రక్తంలో గ్లూకోజు స్థాయిలపై ప్రభావం చూపుతుంది.

హార్మోన్లపై ప్రభావం:
నిద్రసరిగ్గా పట్టనట్లయితే…గ్లూకోజ్ నియంత్రించే హార్మన్లపై ప్రభావం పడుతుంది. కొన్నిరోజులపాటు ఇలాగే కొనసాగినట్లయితే…డయాబెటిస్ అటాక్ చేసే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఇన్సులిన్ మనం గాఢనిద్రలో ఉన్నప్పుడు అధికంగా రిలీజ్ అవుతుంది. ఒకవేళ సరిగా నిద్రపట్టకపోతే ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి కాదు. దీంతో గ్లూకోజు స్థాయిలు రక్తంలో అధికంగా పెరుగుతాయి. నిద్రలేకపోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత సమస్య కూడా తలెత్తతుంది. ఇలా వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారడంతో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్సులిన్ నిరోధకత తలెత్తితే కణాలు గ్లూకోజు స్వీకరించలేవు కాబట్టి. కణాలు గ్లూకోజును స్వీకరించేలా చేయాలంటే ఇన్సులిన్ అనేది అత్యంత అవసరం. కణాలు స్వీకరించకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజు స్టాయి అనేది పెరుగుతుంది. ఫలితంగా మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది.

అంతేకాదు సరైన నిద్రపోనట్లయితే…ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ హార్మోన్ ఉత్పత్తి పెరిగిపోతుంది. దీంతో మానసిక సమస్యలు, తలనొప్పి మొదలై.. నిద్రలేమి వల్ల ఆకలి తగ్గుతుంది. దీనంతటికి కారణం లెఫ్టిన్ అనే హార్మోన్లు. నిద్ర సరిగా పట్టకపోతే వీటి స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. దీంతో సరిగా తినక పోషకాహారలోపం కూడా తలెత్తవచ్చు. ఇలా నిద్రలేమి వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఆల్కాహాల్ ,పొగతాగడం వంటివి కూడా నిద్రను దూరం చేస్తాయి. వీటివల్ల షుగర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రాత్రి పూట హాయిగా నిద్ర పట్టే ఆహారాలను తినాలి. నూనెలో వేయించిన పదార్థాలు, మసాలా పదార్థాలకు ఎట్టిపరిస్థితుల్లో తీసుకోరాదు.

సంఖ్య పెరిగిపోతోంది…
ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల మందికి పైగా ప్రజలు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ప్రతి ఏటా ఈ సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఒక్క భారత్ లోనే ఏడున్నర కోట్ల మందికి పైగా ప్రజలు షుగర్ తో బాధపడుతున్నారు. . పాతికేళ్లలోపు వయస్సున్న వారు కూడా డయాబెటిస్ బారిన పడుతున్నారు. అందుకే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా సమయానికి నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఒత్తిడి తగ్గించుకోవడం…ఇవన్నీ కూడా సరిగ్గా పాటించినట్లయితే….డయాబెటిస్ తోపాటు ఏ ఇతర అనారోగ్యసమస్యలు కూడా దరిచేరవు.

Exit mobile version