Site icon HashtagU Telugu

Health Tips: గోరు వెచ్చని నీటిలో పసుపు కలుపుకుని తాగితే గుండె సమస్యలు రావా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!

Health Tips

Health Tips

భారతీయుల వంటగదిలో ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా పసుపు ఉంటుంది. పసుపును ఎన్నో రకాల వంటలు తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇది రుచిని పెంచడంతో పాటు అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పసుపును ఎన్నో రకాల ఆయుర్వేద ఔషధాలు తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇది యాంటీ బయటి ఇంకా కూడా పనిచేస్తుంది. పసుపు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. చాలా రకాల చర్మ సమస్యలను పసుపును ఉపయోగించి తగ్గించుకోవచ్చు. అయితే అలాంటి పసుపును గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగితే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో నిండి ఉంటుంది. ఈ మూలకాలు బాడీలో LDL స్థాయిలను తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. కొలెస్ట్రాల్ ఆక్సీకరణని నివారించేందుకు కూడా పసుపు హెల్ప్ చేస్తుంది. ఇది ధమనులు గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగ్గా చేస్తుంది. ఈ కారణాల వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం తగ్గుతాయని తెలిపారు. దీంతో గుండె సమస్యలు ఉన్నవారు గోరువెచ్చని నీటిలో పసుపు వేసుకుని తాగడం మంచిదని తెలిపారు. కర్కుమిన్ ఒక సహజ సమ్మేళనం. ఇది పసుపుకు ఔషధ గుణాలను అందిస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో కర్కుమిన్ హెల్ప్ చేస్తుంది. కొలెస్ట్రాల్ ఆక్సీకరణని నిరోధిస్తుంది. దీని ద్వారా ధమనుల్లో బ్లాకేజ్, రక్త ప్రవాహంలో సమస్యలు తగ్గడం జరుగుతుందని తెలిపారు.

పసుపు రక్తనాళాలు గడ్డ కట్టడాన్ని కరిగించి, నియంత్రించడంలో సహాయపడుతుందట. ఈ కారణంగా రక్త ప్రవాహం మెరుగ్గా మారుతుందని, దీంతో స్ట్రోక్ వంటి సమస్యలు రావని చెబుతున్నారు. పసుపు నీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే గుండె సమస్యలు రావట. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటాయని, అలాగే రక్తపోటుని కంట్రోల్ చేస్తాయని, ధమనుల వాపుని తగ్గిస్తాయని చెబుతున్నారు.