Site icon HashtagU Telugu

Tulasi Benefits: చలికాలంలో తులసి ఆకులు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Tulasi Benefits

Tulasi Benefits

తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా హిందువుల ఇండ్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. పూర్వం నుంచి తులసి మొక్కను ఎన్నో రకాల ఔషధాలు తయారీలో ఉపయోగిస్తున్నారు. తులసి మొక్క వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలగడంతో పాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. తులసి ఆకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ మొదలైన లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. తులసి ఆకుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

తులసి ఆకులు గుండెల్లో మంట, అజీర్ణం, అసిడిటీ వంటి పలు ఉదర సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. శరీరంలో pH స్థాయులను క్రమబద్ధీకరించడంలో సమర్థంగా తోడ్పడుతాయి. అయితే చలికాలంలో తులసి ఆకులను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలో ప్రతిరోజు రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకులను నమిలితే జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరం అవుతాయి. గొంతు నొప్పి, ముక్కు మూసుకుపోవడం లాంటి సమస్యల నుండి బయట పడవచ్చు. తులసి ఆకులు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఖాళీ కడుపుతో తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

అలాగే ఇందులో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్, రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అలాగే గుండెపోటు వంటి వ్యాధులను నివారిస్తాయి. అలాగే తులసి ఆకులను ఖాళీ కడుపుతో తినడం వల్ల కడుపు సమస్యలు రావు. జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పొత్తికడుపు సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా తులసి ఆకులు ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం, పుల్లని త్రేనుపు వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. తులసి ఆకులు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదండోయ్ దానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. ప్రతి రోజూ ఉదయం తులసి ఆకులను నమలడం వల్ల చర్మం మెరిసిపోతుంది. తులసి ఆకులలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి శుభ్రపరుస్తాయి. మొటిమలను నివారిస్తాయి. నోటి దుర్వాసన సమస్యలతో బాధపడుతున్నవారు తులసి ఆకులను క్రమం తప్పకుండా తినడం వల్ల వాటిలో ఉండే గుణాలు నోటిలోని బ్యాక్టీరియాను చంపి నోటి దుర్వాసనను తగ్గిస్తాయి.