Site icon HashtagU Telugu

Body Pains: ఆ ప్రదేశంలో ఐస్ ముక్క పెడితే ఈ 5 సమస్యలు పరార్!

Ice On Neck

Ice On Neck

కరోనా మహమ్మారి వచ్చిన తరువాత చాలా ప్రైవేట్ కంపెనీలు నీలో పని చేసే ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వర్క్ ని ఇచ్చారు. అయితే ఈ వర్క్ ఫ్రం హోం విధానం ఎప్పటి నుంచి అయితే అమలు అయ్యిందో అప్పటినుంచి ఇంట్లో ఉండి పనిచేసే ఉద్యోగులు అనేక రకాల ఆరోగ్య సమస్యలను బారిన పడుతున్నారు. ఎక్కువగా వెన్ను నొప్పి, కీళ్ల నొప్పి, మెడ నొప్పి ఇలాంటివి. ఎక్కువసేపు ఒకేవైపు ఎక్కువ సమయం చూడడం వలన మెడ నొప్పి బాధిస్తుంటుంది. అలాగే ఎక్కువ సేపు ఒకే చోట కూర్చుని ఉండటం వల్ల వెన్ను నొప్పి కలుగుతుంది.

ఇక అలాగే సిస్టం ముందు కూర్చుని సిస్టం వైపు చూడటం వల్ల కూడా మెడనొప్పి వస్తుంది. కొందిరికి నిద్రలో ఒకేవైపు పడుకోవడం వలన మెడ పట్టేస్తూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు మెడ నొప్పి తీవ్రంగా వేధిస్తుంది. కొందరికి మెడ పై భాగంలో కండరాల ఒత్తిడి, నరాలపై ఒత్తిడి కారణంగా మెడ నొప్పి తలెత్తుతుంది. అయితే మెడ వెనుక, వెన్నెముక పుర్రె కలిసే భాగంలో ఒక మంచు ముక్కలు పెడితే ఎటువంటి ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇలా వెన్నెముక, పుర్రే కలిసే భాగంలో మంచు ముక్కను పెట్టడం వల్ల జీవక్రియ సమస్యలు తగ్గుతాయి.

మూడ్ మారీ ప్రశాంతంగా ఉంటారు. మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే జలుబు,తలనొప్పి, పంటినొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. శ్వాస,థైరాయిడ్ సమస్యలు తగ్గి మంచి నిద్ర వస్తుంది. ప్రతిరోజు ఈ విధంగా 20 నిమిషాలు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.

Exit mobile version