Site icon HashtagU Telugu

Cholesterol: కొలెస్ట్రాల్‌ ను కంట్రోల్ చేసేందుకు ఈ ట్యాబ్లేట్ ట్రై చేయండి..

High Cholesterol

Try This Tablet To Control Cholesterol.

అధిక కొలెస్ట్రాల్‌ (Cholesterol) తీవ్రమైన సమస్య. లైఫ్‌‌స్టైల్‌ మార్పులు, చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాల వల్ల చాలా మంది హై కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారు. NCBI నివేదిక ప్రకారం, భారతదేశ నగరాల్లో 25-30% మంది, గ్రామాల్లో 15-20% మంది ప్రజలు అధిక కొలెస్ట్రాల్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా రక్తంలో కొలెస్ట్రాల్‌ (Cholesterol) స్థాయులు, 200 ఎంజీ/డీఎల్‌ మించకూడదు. ఇది దాటితేనే.. ముప్పు వాటిల్లుతుంది. మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్‌ స్థాయిలు అధికంగా ఉంటే.. గుండె సమస్యలు, హార్ట్‌ ఎటాక్‌, స్ట్రోక్‌, హైపర్‌టెన్షన్‌, డయాబెటిస్‌ ముప్పు పెరుగుతుంది. పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. కొన్ని రకాల మందుల ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి ఇప్పటికే చాలా మందులు ఉన్నాయి, అయితే JACC జర్నల్‌ ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం, కొత్త కొలెస్ట్రాల్ డ్రగ్ MK-0616 (MK-0616) చెడు కొలెస్ట్రాల్‌ను 60% వరకు తగ్గించగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ కొత్త ఔషధం కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గిస్తుంది, ఎంత ప్రభావవంతంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

MK-0616 కొలెస్ట్రాల్‌ను (Cholesterol) ఎలా తగ్గిస్తుంది..?

పరిశోధకులు ఇటీవల MK-0616 ఔషధంపై రెండవ ట్రయల్‌ను పూర్తి చేశారు. MK-0616 ఔషధం PCSK9 అనే ప్రోటీన్‌ నిరోధిస్తుంది. తక్కువ సాంద్రత ఉన్న లిపోప్రొటీన్ (LDL) కొలెస్ట్రాల్‌ను లివర్‌ విచ్ఛిన్నం చేయడానికి PCSK9 ప్రోటీన్‌ సహాయపడుతుంది.

8 వారాలా పాటు ఇచ్చారు..

పరిశోధకులు తమ అధ్యయనంలో 380 మంది హృద్రోగులను గ్రూపులుగా విభజించి 8 వారాల పాటు ఈ మెడిసిన్‌ను వారికి ఇచ్చారు. ఈ టాబ్లెట్ 6mg, 12mg, 18mg, 30mgలలో అందుబాటులో ఉంది.

41 శాతం తగ్గింది

ఈ ట్యాబ్లెట్‌ 30mg మోతాదు తీసుకున్న వారిలో 60%, 18mg తీసుకున్న వారిలో 59%, 12mg తీసుకున్న వారిలో 55%, 6mg తీసుకున్న వారిలో 41% చెడు కొలెస్ట్రాల్ తగ్గిందని పరిశోధకులు కనుగొన్నారు.

సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా..?

ఈ ఔషధం కారణంగా ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ ఔషధాన్ని.. మరింత వివరంగా పరిశోధించడానికి మరిన్ని ట్రయల్స్ అవసరమని శాస్త్రవేత్తలు చెప్పినప్పటికీ.. హార్ట్‌ పేషెంట్స్‌కు ఇది గొప్పవరం అనే చెప్పాలి.

స్టాటిన్స్‌తో మంచి కాంబినేషన్‌..

ఈ ట్యాబ్లెట్‌.. స్టాటిన్స్‌తో బాగా పనిచేస్తుందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ట్రయల్స్‌లో 60% మంది ఇప్పటికే.. స్టాటిన్స్ తీసుకుంటున్నారని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ ట్యాబ్లెట్‌ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read:  Amoeba Attack: మెదడును తినే అమీబా ఎటాక్.. ఒక వ్యక్తి మృతి.. ఎందుకు? ఎలా?

Exit mobile version