Headache Cure:తలనొప్పికి మాత్ర వేస్తున్నారా..?ఒకసారి ఈ ఆయిల్స్ ప్రయత్నించండి..!!

తలనొప్పి...చిన్నదే కావచ్చు...కానీ దాని బాధ భరించే వాళ్లకే తెలుస్తోంది. కంటికి కనిపించని తలనొప్పి...పక్కనవాళ్లకు ఏం అర్థంకాదు.

  • Written By:
  • Publish Date - May 26, 2022 / 06:30 PM IST

తలనొప్పి…చిన్నదే కావచ్చు…కానీ దాని బాధ భరించే వాళ్లకే తెలుస్తోంది. కంటికి కనిపించని తలనొప్పి…పక్కనవాళ్లకు ఏం అర్థంకాదు. జ్వరం, జలుబు బయటకు కనిపిస్తుంది. కానీ తలనొప్పి బయటకు కనిపించడం కాదు…తలపట్టుకుని మనమే బాధపడాలి. దీని వల్ల కొందరు చాలా డిస్ట్రబ్ అవుతుంటారు. ఏ పనిపై శ్రద్ధ వహించలేరు. పడుకోలేరు…కూర్చోలేరు. మూడ్ అంతా మారిపోతుంది.

అయితే తలనొప్పి రాగానే ట్యాబ్ లెట్ వేసుకుంటే కానీ తగ్గదు. కానీ తరచూ తలనొప్పి వస్తుంటే…మీరు ప్రతిసారి టాబ్ లెట్ వేసుకోవడం మంచిది కాదు. అసలు తలనొప్పి ఎందుకు వస్తుంది…కారణం ఏంటో తెలుసుకోవాలి. తలనొప్పి వచ్చేందుకు ఎక్కువగా ఒత్తిడి, నిద్రలేమి, అతిగా ఆలోచించడం ఇవన్నీ కారణాలు. వీటిలో ఏదొక దానివల్లే మీకు తలనొప్పి వస్తుంది. ఇవి కాకుండా ఇతర కారణాలు కూడా ఉంటాయనుకోండి. అయితే తలనొప్పికి సహజసిద్ధమైన పరిష్కారం కూడా ఉంది. కొన్ని రకాలు పరిమళమైన నూనెలతో తలనొప్పి మాయం చేయోచ్చట. అవేంటో తెలుసుకుందాం.

పెప్పర్ మెంట్ నూన్..:
ఈనూనె తలనొప్పి, కండరాల నొప్పి, దురద, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. కెమోనిలా నూనె నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. ఇలా తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన తగ్గడానికి దోహదం చేస్తుంది. యూకలిప్టస్ నూనె పుండ్లను తగ్గిస్తుంది. రక్తంలో గ్లూకోజు నియంత్రణలో ఉండేందుక, నంజుపొక్కులు తగ్గేందుకు ఈ నూనె బాగా ఉపయోగపడుతుంది.

లావెండర్ నూన్:
ఈ నూనె దిగులు, ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. పార్శ్వనొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ప్రశాంత ఇస్తుంది. డిస్టర్బ్ గా ఉన్నవాళ్ల మైండ్ కూడా లావెండర్ ఆయిల్ వాసనకు సెట్ అయిపోతుంది. స్టీమ్ డిస్టిలేషన్ ప్రాసెస్ లో రెడీ అయ్యే లావెండర్ నూనెకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. శరీరం రిలాక్స్ అయ్యేలా చేయడంతోపాటు ..నీరసం కూడా దూరం చేస్తుంది. ఇవే కాదు చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

ఇక మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే…గాఢంగా ఉండే పరిమళ నూనెలను నేరుగా చర్మానికి రాసుకోకూడదు. ఇతర నూనెల్లో కలిపి రాసుకోవాలి. టిష్యూ మీద రెండు మూడు చుక్కలు వేసి వాసన పీల్చుకోవచ్చు. రూం ఫ్రెష్ నర్ లోనూ కొన్ని చుక్కలు కలుపుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన ఫ్లేవర్ ఉన్న నూనెను ఎంచుకుని తలనొప్పికి ట్రై చేయండి. టాబ్ లెట్ ప్రతిసారి వాడటం కంటే ఈ ఆయిల్స్ ను అప్పుడప్పుడు ప్రయత్నించడం మంచిది.