Site icon HashtagU Telugu

Children Immunity : శీతాకాలంలో మీ పిల్లలకు ఇమ్యూనిటీని పెంచడానికి ఈ ఫుడ్స్ ను ట్రై చేయండి.

Winter Foods For Kids

Try These Foods To Boost Your Kids Immunity

శీతాకాలం వ్యాధులు చుట్టుముడుతుంటాయి. జలుబు, దగ్గు, ఫ్లూ, ఆస్తమా, ఇన్ఫెక్షన్స్‌ వంటి సమస్యలు ఇబ్బందిపడెతూ ఉంటాయి. పెద్ద వారితో పోలిస్తే.. పిల్లలకు ఇమ్యూనిటీ (Children Immunity) మరింత తక్కువగా ఉంటుంది. దీంతో, ఈ సీజన్ వారికి మరింత కష్టంగా ఉంటుంది. కరోనా వైరస్‌ ముప్పు పొంచి ఉంది కాబట్టి.. తల్లిదండ్రులు వారి రోగనిరోధక శక్తి పెంచే ఆహారం అందించాల్సి ఉంటుంది. పిల్లలను సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచే.. టేస్టీ ఆహార పదార్ధాలు గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

ఖర్జూరం:

ఖర్జూరం టిస్ట్‌లోనూ మధురంగా ఉంటాయి. అందుకే అందరూ దీన్ని ఎంతో ఇష్టపడతారు. ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరంలో సెలీనియం, క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్‌, కాపర్‌, మెగ్నీషియంతో సహా 15 మినరల్స్‌ ఉన్నాయి. దీనిలో 23 అమైనో యాసిడ్స్‌, పాల్మిటోలిక్‌, ఒలీక్, లినోలెయిక్, లినోలెనిక్ యాసిడ్‌‌‌‌ వంటి అసంతృప్త ఫ్యాటీ యాసిడ్స్‌ ఉన్నాయి. మీ బిడ్డకు 6 నెలలు దాటిన తర్వాత నుంచి ఖర్జూరం పెట్టవచ్చు. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి.. మెత్తగా చేసి ఇవ్వడం మేలు. రోజూ నాలుగు ఖర్జూరాలను పిల్లల డైట్‌లో చేరిస్తే.. వారి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఖర్జూరాలు హిమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచుతాయి. మీ బిడ్డను వెచ్చగా ఉంచుతాయి.

గుడ్లు:

గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. మీ బిడ్డకు 8 నెలల వయస్సు వచ్చిన తర్వాత మీరు గుడ్లు ఇవ్వడం ప్రారంభించవచ్చు. వారానికి 2 లేదా 3 సార్లు గుడ్డు పెడితే సరిపోతుంది. వ్యాధి కారకాలతో పోరాడే పోషకాలున్న సూపర్‌ ఫుడ్‌ ఇది. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు.. ఇవన్నీ కోడిగుడ్డులో పుష్కలంగా లభిస్తాయి. దీనిలో ఫోలేట్, సెలీనియం, ఫాస్ఫరస్, విటమిన్ ఎ, బి12, బి5, బి2 వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి మీ పిల్లలో ఇమ్యూనిటీని (Children Immunity) పెంచుతాయి.

చికెన్‌, ఫిష్‌:

మీ బిడ్డకు ఏడాది పూర్తైతే.. చేపలు, చికెన్‌ కూడా తినిపించవచ్చు. మీటిని మెత్తగా ఉడికించి మాత్రమే వాళ్లకు పెట్టాలి. చేపలు, చికెన్‌లో ప్రొటీన్‌ సమృద్ధిగా ఉంటుంది. చలిలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సూప్‌లు కూడా బెస్ట్‌ ఆప్షన్‌. చేపలు, చికెన్‌తో సూప్‌ చేసి పెట్టినా మంచిదే.

నెయ్యి:

నెయ్లిలో ఉండే విటమిన్స్‌, యాంటీఆక్సిడెంట్స్‌, మినరల్స్‌, ఎషెన్సియల్‌ అమినో యాసిడ్స్‌ పిల్లల శారీరక, మానసిక వికాసానికి తోడ్పడతాయి. నెయ్యిలో ఉండే పోషకాలు.. శీతాకాలంలో వారిని వెచ్చగా ఉంచుతాయి. మీరు పప్పులు, కిచిడీ, ఓట్స్‌లో నెయ్యి వేసి పిల్లలకు పెడితే.. వారి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

తేనె:

మీ బిడ్డకు ఏడాది దాటిన తర్వాత.. తేనె ఇవ్వడం స్టార్ట్‌ చేయవచ్చు. వారానికి ఒకటి లేదా రెండుసార్లు సగం టీస్పూన్ తేనె ఇస్తే వారికి ఇమ్యూనిటీ పెరుగుతుంది. వారికి జలుబు, దగ్గు, గొంతు సమస్యలు రాకుండా తేనె వారిని రక్షిస్తుంది. NCBI లో ప్రచురించబడిన ఒక పరిశోధన ప్రకారం, ఒక సంవత్సరం కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు రాత్రి పడుకునే ముందు దగ్గు ఎక్కువగా ఉంటే.. 1.5 టీస్పూన్ల తేనెను ఇవ్వవచ్చు.

Also Read:  Black Pepper : ఆరోగ్యానికి అద్భుత వరం మిరియాలు

Exit mobile version