Smoking: స్మోకింగ్ మానేయాలా.. 7 ఫుడ్స్ ట్రై చేయండి

స్మోకింగ్.. వెరీ డేంజరస్. ఈవిషయం తెలిసినా చాలామంది ఆ అలవాటును వదలట్లేదు.

స్మోకింగ్ (Smoking) వెరీ డేంజరస్. ఈ విషయం తెలిసినా చాలామంది ఆ అలవాటును వదలట్లేదు. దానివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్, మధుమేహం, కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ధూమపానం (Smoking) మానేయడంలో సహాయపడే 7 ఆహారాల గురించి తెలుసుకుందాం..

1. పాలు

చాలా మంది వైద్యులు పాలను సిఫార్సు చేస్తున్నారు.  ధూమపానానికి బదులుగా కొంచెం పాలు తాగడం వల్ల సిగరెట్‌లు తక్కువ రుచిగా అనిపిస్తాయని అంటున్నారు. కాబట్టి రోజూ కొంచెం పాలు తాగండి.

2. పండ్లు, కూరగాయలు

పండ్లు మరియు కూరగాయలు కూడా పాలతో సమానమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ పోషకాలు ఉంటాయి. ఇవి స్మోకింగ్ వల్ల మీ బాడీపై పడే నెగెటివ్ ఎఫెక్ట్స్ ను తగ్గిస్తాయి.

3. పాప్‌కార్న్, ఫాక్స్ నట్స్

ధూమపానం మానేయడం వల్ల ఎక్కువ ఆకలి అవుతుంది. ఇటువంటి పరిస్థితిలో పాప్‌కార్న్ లేదా ఫాక్స్ గింజలను తినొచ్చు. అతిగా తిన్నామన్న అపరాధం.. కాబట్టి రోజూ ఒక కప్పు తిని ఆపేయండి.

4. తీపి ఆహారాలు

స్మోకింగ్ మానేసిన వ్యక్తులు తరచుగా స్వీట్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతారు. ఈక్రమంలో  డెజర్ట్‌లు లేదా చాక్లెట్‌లకు బదులుగా తాజా పండ్లు తింటే మంచిది.

5. దాల్చిన చెక్క

స్మోకింగ్ అలవాటును వదలాలంటే దాల్చిన చెక్కను నమలొచ్చు. ఇది మీ నోటిని బిజీగా ఉంచుతుంది. పొగతాగే కోరిక నుండి దూరంగా ఉంచుతుంది.

6. బీన్స్

స్మోకింగ్ కు ఇక గుడ్ బై చెప్పాలంటే.. ఫైబర్ మరియు ప్రోటీన్లు అధికంగా ఉండే బీన్స్ తినాలి. ఇవి మీ బాడీకి ఎక్కువసేపు ఎనర్జీ ఇస్తాయి. ఆకలి బాధలను అదుపులో ఉంచుతాయి. బీన్స్ లో ఫైబర్ , మొక్కల స్టెరాల్స్ పుష్కలంగా ఉంటాయి.ఇవి గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.

7. జిన్సెంగ్ టీ

జిన్‌సెంగ్ టీ మెదడులోని న్యూరో ట్రాన్స్‌మిటర్ అయిన డోపమైన్ ప్రభావాన్ని బలహీనపరచడంతో సంబంధం కలిగి ఉంటుంది.ఇది ఆనందంతో సంబంధం కలిగి ఉంటుంది. స్మోకింగ్ చేసినప్పుడు మెదడులో డోపమైన్ విడుదల అవుతుంది.  జిన్‌సెంగ్ టీ తాగడం వల్ల డోపమైన్ ప్రభావం తగ్గిపోతుంది. స్మోకింగ్ వల్ల పెద్దగా సంతృప్తి ఉండదు. ఫలితంగా లాంగ్ టర్మ్ లో మీరు స్మోకింగ్ వదిలే అవకాశాలు ఏర్పడుతాయి.

Also Read:  Sunglasses: సమ్మర్ కోసం సన్ గ్లాసెస్ కొంటున్నారా.. ఇవి తెలుసుకోండి