Site icon HashtagU Telugu

Travel Sickness: ప్రయాణాల్లో వాంతులు ఆపడం కోసం అలా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త?

Nauseous When You Wake Up

Nauseous When You Wake Up

చాలామందికి ప్రయాణం చేయడం అంటే అసలు ఇష్టం ఉండదు. లాంగ్ జర్నీ చేసేటప్పుడు చాలా మంది వాంతులు చేసుకుంటూ ఉంటారు. కార్లు, సుమోలు బస్సులలో చాలామందికి వామిటింగ్ వస్తూ ఉంటుంది. తలనొప్పి, తల తిరగడం, వాంతులు ఇలా రకరకాల బాధలు పడుతుంటారు. ఇది పిల్లలు, పెద్దలు అందరిలో ఉంటుంది. కానీ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా కార్లో వెనుక సీట్లో కూర్చుంటే ఇక వీరి పరిస్థితి పనక్కర్లేదు. అయితే వాంతులు రాకుండా ఉండడం కోసం చాలామంది రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కొందరు గ్యాస్ బాగా ఉన్న కూల్ డ్రింక్స్ తాగితే మరికొందరు చేతిలో నిమ్మకాయ తీసుకొని కొద్దిసేపటికి ఒకసారి దాన్ని స్మెల్ చూస్తూ ఉంటారు.

ఇంకొందరు వాంతుల రాకుండా ఉండడం కోసం మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటారు. అలాంటి మెడిసిన్స్ పిల్లల ప్రాణాలకు ప్రమాదం. స్కూపోడెర్మ్ ప్యాచెస్ ను శరీరం మీద అతికించుకుని క్రూయిజ్ ప్రయాణంలో సీ సిక్ నెస్ నుంచి కాపాడుకునేందుకు వాడుతారు. వీటిని డాక్టర్లు చాలా విరివిగా సిఫారసు చేస్తారు. వీటిని సరైన పద్ధతిలో వాడితే సురక్షితమైనవి కూడా.చాలా మంది మందులను సరైన పద్ధతిలో వాడరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పదేళ్లలోపు పిల్లలకు ఇలాంటి ప్యాచెస్ వెయ్యడం, వాటిని తొలగించడం మాత్రమే కాదు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఉపయోగించడం, నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయం పాటు అవి శరీరం మీద ఉండడం వంటి విషయాల్లో తప్పులు చేస్తుంటారు.

ఇలాంటి దుర్వినియోగంతో ఈ మందుల వల్ల హైపర్ థెర్మియాకు దారి తీస్తుంది. ఇది ప్రాణాంతకమైన స్థితి. శరీర ఉష్ణోగ్రతలు మోతాదుకు మించి తగ్గిపోవడాన్ని హైపర్ థెర్మియా అంటారు. శరీరం తిరిగి తనకు తానుగా ఈ ఉష్ణోగ్రతను రెగ్యులేట్ చేసుకోలేదు. ఇలా ప్యాచ్ లు గా ఉపయోగించే మందులను యాంటికోలినెర్జిక్ మందులు అంటారు. ఇవి శరీరానికి, మెదడు మధ్య ప్రసారమయ్యే కొన్ని రసాయన సంకేతాలను నిరోధిస్తాయి. తద్వారా తలతిగడాన్ని నిరోధించి మోషన్ సిక్ నెస్ ను నివారిస్తాయి. వీటి వినియోగంలో తప్పులు జరిగితే ఈ మందులు ఊపిరితిత్తుల్లో పక్షవాతం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మూర్చరావడం, బ్రాంతి కలగడం వంటి తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగించే ప్రమాదం ఉంటుంది. అలాగే వాంతులు, వికారం రాకుండా నివారించే మందులు కూడా ఇలాగే పనిచేస్తాయి. కాబట్టి, అవి కూడా ప్రమాదకరమం.

Exit mobile version