Site icon HashtagU Telugu

Health Tips: దగ్గు,జలుబు తొందరగా తగ్గాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?

Health Tips

Health Tips

మామూలుగా దగ్గు, జలుబు వంటివి వాతావరణం లో మార్పులు వచ్చినప్పుడు లేదంటే సీజన్ చేంజ్ అయినప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొందరికి ఒకచోట ఉండి ఇంకొక చోట నీళ్లు అలాగే ఆ ప్రాంతంలో ఎక్కువగా గడిపితే ఇలా దగ్గు జలుబు ఉంటాయి. కొందరికి ఎక్కువగా కూలింగ్ ఉన్న వాటర్ కూల్డ్రింక్స్ వంటి చల్లటి పదార్థాలు తాగడం వల్ల కూడా ఈ దగ్గు జలుబు వస్తూ ఉంటాయి. ఇవి ఒక్కసారి వచ్చాయి అంటే చాలు వారాల తరబడి మనుషులను వేధిస్తూ ఉంటాయి.

ఎన్ని చిట్కాలు ఉపయోగించి ఎన్ని మెడిసిన్స్ ఉపయోగించిన కూడా ఈ దగ్గు జలుబు అంత తొందరగా తగ్గదు. వీటి కారణంగా రాత్రులు సరిగ్గా నిద్ర ఉండదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకు పసుపు పాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. పసుపులో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇలాంటి పసుపు దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందడానికి ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం ఒక గ్లాస్ గోరువచ్చని పసుపు పాలను రాత్రి పడుకునే ముందు తాగితే గొంతులో చికాకు తగ్గి బాగా నిద్రపడుతుంది. మీకు దగ్గు జలుబు నుంచి ఉపశమనం పొందే వరకు ఈ పానీయం తాగడం మంచిది.

జలుబు నాసికా కుహరం వాపుకు కారణం అవుతుంది. అయితే నీలగిరి చెట్టు ఆకుల సారంలో ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి నాసికా రద్దీని తగ్గించడానికి, శ్లేష్మాన్ని బయటకు పంపడానికి సహాయపడతాయి. ఇందుకోసం టీ లేదా నూనెను ఉపయోగించవచ్చు. యూకలిప్టస్ దగ్గును తగ్గించడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. నీలగిరి ఆకుల ఆయిల్ లేదా యూకలిప్టస్ కలిగిన బామ్లను మీ ఛాతీ, గొంతుకు రుద్దడం లేదా ఆవిరి పీల్చడం వల్ల దగ్గు, జలుబు తొందరగా తగ్గుతాయట.

అలాగే కర్పూరం దగ్గును తగ్గించి నిరోధకంగా పనిచేస్తుంది. జలుబు కారణంగా తలనొప్పి దగ్గుతో ఇబ్బంది పడుతున్న వారు కర్పూరం వాసనను తరచుగా పీలుస్తూ ఉండడం వల్ల ఉపశమనం పొందవచ్చట. ఒక టేబుల్ స్పూన్ పై రెండు నుంచి మూడు కర్పూరం బాల్స్ వేసి మంటలు వచ్చే వరకు వేడి చేయాలి. వేడిని ఆపివేసి, పొగలు ఆవిరి కావడం ప్రారంభించినప్పుడు నెమ్మదిగా పీల్చాలి. ఇది శ్వాసకోశ బాధ నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడుతుందని చెబుతున్నారు.

గొంతు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందాలి అనుకున్నవారు కొద్దిగా అల్లం తురిమి మరిగే నీటిలో కలపాలి. అది మరిగిన తర్వాత అందులో కొద్దిగా తేనె కలిపి వేడి/గోరు వెచ్చని నీటిని రోజుకు రెండు మూడు సార్లు తాగాలి. ఈ మిశ్రమం గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి, సౌకర్యాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.