Site icon HashtagU Telugu

Beauty Tips: ఈ పేస్ ప్యాక్స్ ట్రై చేస్తే చాలు.. ఫేసియల్,క్రీమ్స్ కూడా అవసరమే లేదు.. అవేంటంటే?

Beauty Tips

Beauty Tips

అందంగా కనిపించడం కోసం ఎన్నో రకాల ఫేస్ ప్యాక్ లో ట్రై చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు అందంగా కనిపించరు. అందంగా కనిపించడం కోసం ఫేషియల్స్, క్రీమ్స్, రకరకాల బ్యూటీ ప్రోడక్ట్ లు వాడుతూ ఉంటారు. అదేవిధంగా బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఇక మీద ఆ అవసరం లేకుండా ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల ఫేస్ ప్యాక్ ను ట్రై చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు కనిపిస్తాయని, ఫేషియల్స్ అలాగే క్రీమ్స్ ఇలాంటివి ఏమీ అవసరం లేదని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఫేస్ ప్యాక్ లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇందుకోసం కుంకుమ పువ్వుని ఒక గిన్నె పాలలో నానబెట్టాలి. బాగా నానిన తర్వాత బొప్పాయి గుజ్జు, బియ్యం పిండి వేసి మెత్తని పేస్టులా చేయాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకి అప్లై చేసి కొద్దిగా మసాజ్ చేయాలి. తర్వాత 20 నుంచి 30 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్నిశుభ్రం చేసుకోవాలి. దీన్ని వారానికి 2 లేదా 3 సార్లు వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయట. ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయడం వల్ల ఆ ముఖం అందంగా మారడంతో పాటు కాంతివంతంగా కనిపిస్తుందట..

మరొక ఫేస్ ప్యాక్ విషయానికి వస్తే.. ఒక గిన్నెలో దోస, బంగాళాదుంప రసం, కలబంద జెల్‌ ని బాగా కలపాలి. దీన్ని ముఖం, మెడకి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచి తరువాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. దీనిని వాడినప్పుడు అప్పటికప్పుడు అందంగా కనిపిస్తారు. ఇన్స్టాంట్ గ్లో ఆఫ్ కోసం దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఏదైనా ఫంక్షన్స్ కి మ్యారేజ్ కి వెళ్ళాలి అనుకున్న వాడికి ఇది బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

మరొక ఫేస్ ప్యాక్ విషయానికి వస్తే..ఒక గిన్నెలో టమాట రసం, రోజ్ వాటర్, గంధం పొడిని కలిపి మెత్తని పేస్ట్‌ లా చేయాలి. ఈ పేస్ట్‌ ని ముఖాన్ని క్లీన్ చేసి ముఖానికి రాయాలి. 15 నిమిషాలు ఆరానివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో క్లీన్ చేయాలట. ఇలా ప్రతి రెండు రోజులకి ఒక సారి అప్లై చేయాలట. ఇది చర్మానికి సహజ టోనర్ గా పనిచేస్తుందని చెబుతున్నారు.

అదేవిధంగా నిమ్మరసం, తేనె, పసుపు కలిపి మెత్తగా పేస్టులా చేసుకుని ముఖం కడిగిన తర్వాత ఈ పేస్ట్‌ ని ముఖానికి అప్లై చేయాలి. 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆరిన తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. మంచి ఫలితాల కోసం వారానికి రెండు సార్లు అప్లై చేయాలి. ఇలా చేస్తే అందంలో వచ్చే మార్పులు మీరే గమనించవచ్చు అని చెబుతున్నారు.